- ఎంపిపీ చేతిలో మంత్రి నిరంజన్ ఓటమి
- దేవాలయ భూములు ఆక్రమించుకోవడమే కారణమంటున్న ప్రజలు
పెబ్బేరు డిసెంబర్ 03 (న్యూస్ తెలంగాణ) :-
వనపర్తి కాంగ్రెస్ అభ్యర్థి మేఘారెడ్డి ఘన విజయం సాధించారు.బీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిపై ఏకంగా 24 వేల 200 ఓట్లతో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది.ఆ పార్టీ నాయకులందరూ సంబరాలు చేశారు.ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తోందనే సంకేతాలు కూడా అందుతున్నాయి. ఒక ఎంపిపి చేతిలో మంత్రి నిరంజన్ రెడ్డి ఓడిపోవడం ఆయన చేసిన అరాచకాలు కబ్జాలే కారణమని దేవాలయ భూములు ఆక్రమించుకోవడం, జర్నలిస్టులపై దాడులు చేయించడం ఆయన ఓటమికి కారణాలు అని చెప్పొచ్చు