ఎండపల్లి,డిసెంబర్03(న్యూస్ తెలంగాణ):
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పాతగూడూర్ లోని ఆటోయూనియన్ సభ్యుల సంక్షేమానికి అభ్యున్నతికి కృషి చేస్తూ అను నిత్యం గ్రామాభివృద్ధికి పెద్ద పాత్ర పోషించిన పోనుగోటి శ్రీనివాసరావు (బాపు) కు ఆదివారం రోజున గ్రామంలోని బస్టాండ్ సమీపంలో గల అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆటోయూనియన్ అధ్యక్షుడు పుప్పాల సతీష్ అధ్వర్యంలో పిఎస్ఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… పోనుగోటి శ్రీనివాసరావు తన స్వగ్రామంలో స్వతహాగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల నిర్వహించారని, గ్రామస్థులకు ఆపద్బాంవుడిగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షుడు చెరుకూరి అనిల్, సభ్యులు అన్నవేని సురేందర్, గంధం జితేందర్, గంగాదరి రవి, బోయిని నర్సయ్య, గాండ్ల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.