September 8, 2024
News Telangana
Image default
PoliticalTelangana

సిఎం రేవంత్ రెడ్డి కి “టీజేఎస్ఎస్” విన్నపం

  • జైలుకు వెళ్లిన జర్నలిస్టులకు మీరు ఏం చేస్తారు.?
  • బీఆర్ఎస్ ప్రభుత్వం అణచివేతకు గురైన జర్నలిస్టులను కాంగ్రెస్ కాపాడుతుందా.?
  • కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం చాలా కృషి చేసిన అక్రమ కేసులు ఎదుర్కొంటున్న జర్నలిస్టులు
  • కెసిఆర్ ప్రభుత్వ నియంత పాలనపై గొంతు ఎత్తిన రిపోర్టర్లు
  • జర్నలిస్టులను మీరైనా కాపాడండి అంటూ రేవంత్ కు టీజేఎస్ఎస్ విన్నపం

హైదరాబాద్ , న్యూస్ తెలంగాణ:- కాంగ్రెస్ పార్టీ అధిష్టానం లోకి రావడానికి కొందరు జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి మరీ నియంతృత్వ ప్రభుత్వంపై పోరాటం పై అలిపెరగని పోరాటం చేశారు. జైళ్ళకు వెళ్ళారు. ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొన్నారు. అక్రమ కేసులు ఎదుర్కొంటున్నారు. మరి వారికి కొత్త ప్రభుత్వం ఏం చేయనున్నదనేది ఓ ప్రధాన ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వాళ్ళు చేసిన సాహసం అంత ఇంతా కాదు ఏకంగా నియంత పైనే పోరాటం చేశారు. అనుకున్నట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది

  • పాత కాపులు.. ‘రంగులు’ పూసుకొని..

జర్నలిస్టులపై ప్రభుత్వం నిర్ధాక్షణ్యంగా ప్రవర్తనలపై తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టు సంఘాలు అన్నీ మూసుకొని ఉన్నాయి. ప్రభుత్వంతో అంటకాగాయి. ఇప్పుడు ఇవే సంఘాలు మళ్ళీ కొత్త రంగులు పూసుకొని కొత్త ప్రభుత్వంలో పెత్తనం చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో కేసీఆర్ తోనే ఉన్న ఈ సంఘాలు, సంఘ నాయకులు ఇప్పుడు కొత్త ప్రభుత్వ పెద్దలకు వలవేస్తున్నాయి. వీళ్లకు జర్నలిస్టుల సంక్షేమం, మంచి చెడులపై అవసరం లేదు ఎ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే వాళ్లకు జోకుడు గా మారిపోతారు.

  • ప్రెస్ అకాడమీ చైర్మన్ గా…

ఈసారి ప్రెస్ అకాడమీ చైర్మన్ గా జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతూ మరోవైపు గత ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నించిన వారికే అప్పగిస్తే కొత్త ప్రభుత్వ గౌరవం పెరుగుతుంది. లేదంటే మళ్ళీ ‘దొర’ల కాలమనే పరిస్థితి రాకూడదు. పది సంవత్సరాల నుండి ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఒక్కరే ఉండడంతో జర్నలిస్టుల సమస్యలు ఒక రోజైనా పట్టించుకున్న పరిస్థితి లేదు కనీసం వాళ్లకు అక్రిడేషన్ కార్డులు ఆరోగ్య బీమా వంటి ఏ సమస్యను పట్టించుకోలేదు. ఈసారి జర్నలిస్టుల పక్షాన పోరాటం చేసే జర్నలిస్టుకు ఇస్తే బాగుంటుందని జర్నలిస్టు సంక్షేమ సంఘం (టీజేఎస్ఎస్) కోరుతోంది

0Shares

Related posts

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు

News Telangana

ఏజెంట్ల చేతిలో మహబూబాబాధ్ రవాణా శాఖ

News Telangana

తెలంగాణలో ముగిసిన పోలింగ్‌

News Telangana

Leave a Comment