December 3, 2024
News Telangana
Image default
Telangana

నల్ల బండ గుట్ట రాఘవాపురం రైతుల సమస్యపై ఆర్డీవో విచారణ…!

  • ఏం కావాలంటూ మోతే తాహసిల్దార్ రైతులను గద్దింపు ..?
  • క్వారీ మూసివేత సాధ్యం కాదు ? ఏం కావాలంటూ పదే పదే అడుగుతున్న వైనం..?
  • పంటలు నష్టపోతుంటే మోతే తాహసిల్దార్ వ్యవహారం పై రైతుల ఆవేదన..?
  • మండల అధికారులకు… “రాజ భోజనం”…?
  • విచారణ ఎదుర్కొంటున్న యజమాని రాజ మర్యాదలు…?
  • మోతే తాహసిల్దార్ ఆఫీసులో లీలలు చూడతరము కాదయ్యా..?
  • వంద మీటర్ల దూరంలో జాతీయ రహదారి…?
  • ఎస్సారెస్పీ కాలువ సైతం కబ్జా..?


స్టేట్ బ్యూరో (న్యూస్ తెలంగాణ) జూలై 24 :-
సూర్యాపేట జిల్లా మోతే మండలం నల్ల బండ గుట్ట సమీపంలోని సర్వే నెంబర్ 161 లో తక్ష కంకర మిల్లు వ్యవహారంపై ఆర్డీవో బుధవారం మోతే మండల పరిధిలోని రాఘవాపురంనల్లబండ గుట్ట సమీపంలోని రైతుల పంట పొలాలను ఆర్డీవో పరిశీలించారు. ఈ మేరకు పలువురు రైతులు కంకర మిల్లు యజమాని దౌర్జన్యాలు పంట నష్టం పై ఫిర్యాదు చేశారు. వ్యవసాయ పొలాలలో ఆర్డీవో తో పాటు మోతే తాహసిల్దార్ సంఘమిత్ర సంఘమిత్ర తదితరులు హాజరై పంటలను పరిశీలించారు. ఈ మేరకు రైతుల స్టేట్మెంట్లను రికార్డు చేయాలని ఆర్డీవో ఆదేశించడంతో రైతులు మోతే తహసిల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అనే సమయానికి మోతే తాహ సిల్దార్ కార్యాలయంలో కంకర మిల్లు యజమాని సిబ్బందితోపాటు ఓ కారులో రుచికరమైన వంటలు భోజన ఏర్పాట్లు చేసి తాహసిల్దార్ తో సంపాదింపులు జరుగుతూ ఉండగా రైతులు స్టేట్మెంట్లు కోసం వచ్చామని తాసిల్దారును కలవగా స్పందించిన తాహ సిల్దార్ సంఘమిత్ర రైతులను ఉద్దేశించి క్వారీ యజమాను నుండి మీకేమి కావాలి? ఏమనుకుంటున్నారు? మీకేం కావాలి చెప్పండి? అంటూ రైతులను గద్దించే ప్రయత్నం చేశారు. తాహసిల్దార్ కార్యాలయ సిబ్బందితో రైతులను ఫోటోలు వీడియోలు తీపించారు. స్టేట్మెంట్ ఇవ్వడానికి వచ్చాం అంటూ రైతులు తెలపగా భూములు ఉన్న వాళ్లు మాత్రమే అది కూడా పాస్ పుస్తకాలు ఉంటేనే స్టేట్మెంట్లు రికార్డు చేయడం జరుగుతుందని తెలిపారు. దీంతో రైతులు గ్రీవెన్స్ లో పదిమంది రైతులు దాకా ఫిర్యాదు చేశామని అందరికీ సమస్య ఉన్నది అందరం స్టేట్మెంట్లు ఇస్తామని భీష్మించి కూర్చున్నారు. దీంతో తహసిల్దార్ రెవిన్యూ ఇన్స్పెక్టర్కు స్టేట్మెంట్లు రికార్డు చేయమని ఆదేశించినట్లే ఆదేశించి తీరా స్టేట్మెంట్ పూర్తయిన తర్వాత ఫిర్యాదుదారుల్లో మొదటి ఉన్న వాళ్లు మాత్రమే ఒక్కరే స్టేట్మెంట్ ఇవ్వాలని మిగతా వారికి సంబంధం లేదని తాహ పలు ఫోన్లో సంభాషణల అనంతరం చెప్పటంతో రైతులు ససేమీరా అని తాహసిల్దార్ తో పలుమార్లు చర్చించినప్పటికీ పాస్ పుస్తకం ఉంటేనే స్టేట్మెంట్ తీసుకుంటామని కరాకండిగా చెప్పటంతో చేసేదేమి లేక రైతులు దిగాలుగా ఇంటి ముఖం పట్టారు. రైతులు స్టేట్మెంట్ ఇచ్చే సమయానికి తాహ సిల్దార్ కార్యాలయం నుండి వెళ్లిపోయారు. కాగా నల్లబండ గుట్ట క్వారీ యజమాని ఎస్సారెస్పీ కాలువ ను సైతం కబ్జా చేసినట్లు సుమారు వంద మీటర్ల దూరంలో 365 నేషనల్ హైవే ఉన్నప్పటికీ ఎటువంటి నిబంధనలు పాటించకుండా దర్జాగా బాంబు బ్లాస్టింగ్లకు పాల్పడుతూ లక్షలాది రూపాయలు నెలనె ల ఆశిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. కాగా సుమారు 70 ఎకరాలలో అటవీ ప్రాంతంలో ఈ క్వారీ నిర్వహించడం వలన 1500 మీటర్ల దూరంలో మరో మూడు గ్రామాలు చెరువులు ఉన్నప్పటికీ నిబంధనలను పట్టించుకోకుండా దర్జాగా కంకర వ్యాపారం నిర్వహిస్తూ రైతులను నట్టేట ముంచుతున్నట్లు ప్రాణభయంతో వ్యవసాయ పనులను చేసుకోవాల్సి వస్తుందని రైతులు వ్యవసాయ పనులకు వెళ్లే డొంకను సైతం ధ్వంసం చేసి రాకపోకలకు ఇబ్బందిగా మార్చి భూములను బీడు భూములుగా మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. ఇదే వ్యవహారం పై ఆర్డీవో విచారణ సందర్భంగా కొందరు మహిళా రైతులు సైతం ఆర్డిఓ కాళ్ళ మీద పడి ప్రాధేయపడటం రైతుల సమస్యలను తెలియజేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా గత సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ లో రైతులు ఫిర్యాదు మేరకు విచారణకు వచ్చిన ఆర్డిఓ స్టేట్మెంట్ల రికార్డుల బాధ్యత స్థానిక తాసిల్దార్ కు అప్పగించడంతో పలువురు రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా తాసిల్దారుకు ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం చేయలేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు

0Shares

Related posts

లోకాయుక్తలో కేసు నడుస్తున్నప్పటికీ ఆగని ”మాజీ సర్పంచ్ భర్త” ఆగడాలు

News Telangana

చేర్యాలలో ఓటేసినా కాంగ్రెస్ అభ్యర్ధి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి దంపతులు

News Telangana

నేడు ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ విడుదల చేసిన తెలంగాణ సర్కార్

News Telangana

Leave a Comment