December 3, 2024
News Telangana
Image default
Telangana

మాదిగ వాడలో ఎమ్మార్పీఎస్ సంబరాలు

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి కోటేష్ మాదిగ

న్యూస్ తెలంగాణ చిలుకూరు ఆగస్టు 1:

మండలంలో ని బస్టాండ్ సెంటర్లో ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు కలిసి బాన సంచులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు, ఈ కార్యక్రమంలో, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి కోటేష్ మాదిగ, మాట్లాడుతూ,
అన్నఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని గుర్తించి, గౌరవించి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ఎమ్మార్పీఎస్ ఉద్యమ ఫలితాన్ని అందించిన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మనసారా కృతజ్ఞతలు ధన్యవాదాలు,అదేవిధంగా ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని 30 సంవత్సరాలుగా గ్రామ గ్రామాన మాదిగ ఉప కులాల ప్రజలను ఏకం చేసి,ఢిల్లీ నడిబొడ్డున దండోరా మోగించి, అలుపెరుగని పోరాటం చేసి,సుప్రీంకోర్టు ద్వారా న్యాయ ఫలితాన్ని అందించిన మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్నకి పాదాభివందనాలు. ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో భాగంగా వీరమరణం పొందిన మాదిగ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ,ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని గౌరవించి,ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో భాగంగా ప్రతి రాజకీయ పార్టీ నాయకులు మద్దతుగా పాల్గొని అండగా నిలిచిన రాజకీయ పార్టీ నాయకులందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా ఎమ్మార్పీఎస్ నాయకులు ఇంట్లో ఒక్కోసారి తినడానికి తిండి లేకున్నా, భార్య పిల్లలను విడిచిపెట్టి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్న ఎప్పుడు పిలుపునిచ్చిన అందుకొని ప్రభుత్వాలకు వణుకు పుట్టించిన,ఎమ్మార్పీఎస్ నాయకులకు,కార్యకర్తలకు మనసారా సామాజిక ఉద్యమాభివందనాలు. తెలిపారు, ఈ కార్యక్రమంలో, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మల్లెపంగు సూరిబాబు మాదిగ, ఎం ఎస్ పి జిల్లా ఉపాధ్యక్షులు సిద్దెల శీను మాదిగ, కందుకూరి ఎల్లయ్య, వడ్డేపల్లి వీరబాబు, కందుకూరి రామారావు, ముదిగొండ బాలు, మల్లెపంగు ఉపేందర్, ముదిగొండ చిరంజీవి, చింత నాగేష్, కందుకూరి లక్ష్మయ్య, కందుకూరి పెద్ద వెంకటేశ్వర్లు, గజ్జి ప్రశాంతు, గజ్జి బిక్షం, మల్లెపంగు రమేష్, కందుకూరి అఖిల్, మల్లెపంగు చిరంజీవి, మరియు తదితరులు పాల్గొన్నారు,

0Shares

Related posts

దళితులపై దాడులు .. ఆపై కేసులు

News Telangana

కోదాడ లో ఘరానా మోసం… సీఐ, ఎస్ఐ అంటూ టోకరా

News Telangana

ఎన్నికల నబందనలను ఉల్లంగించిన ఇద్దరు వ్యక్తుల పై కేసు నమోదు

News Telangana

Leave a Comment