September 8, 2024
News Telangana
Image default
Telangana

పాల్వంచ చెక్ పోస్ట్ లో స్వాతంత్ర దినోత్సవం నాడు సైతం అక్రమ వసూళ్లకు సెలవు ఇవ్వని ఉదంతం

  • ఆర్టిఏ చెక్దో పోస్ట్ కేంద్రంగా చేసుకొని దారి దోపిడీకి పాల్పడుతున్న పాల్వంచ ఆర్టిఏ చెక్ పోస్ట్ సిబ్బంది ?
  • వాహనాన్ని బట్టి రేటు ? ఖాళీ వాహనమైన ముడుపులు ఇవ్వాల్సిందే ?
  • వాహనదారులలో పెరుగుతున్న అసంతృప్తి ?
  • సిబ్బంది తీరుపై తెలంగాణ విస్తృత చర్చ ?
  • పట్టించుకోని ప్రత్యేక యంత్రాంగాలు ?
  • వాహనదారులను జలగల్లా పిక్కు తింటున్న “చెక్ పోస్ట్” సిబ్బంది పై చర్యలు తీసుకోరా ?

ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో, ఆగస్టు 15 (న్యూస్ తెలంగాణ) :- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ఆర్టిఏ చెక్ పోస్ట్ సిబ్బంది అవినీతికి అంతు పంతులు లేకుండా పోతుంది. ఖాళీగా వెళ్లే లారీ అయినా ఆటో అయినా 400 నుండి 500 వరకు అదే అధిక లోడుతో వెళితే 600, 700 వెయ్యి రూపాయలు ఇసుక లారీలు దెగ్గర అయితే మరీ చెప్పనక్కర్లేదు లారికి 700 నుంచి 1000 రూపాయలు వరకు అక్రమంగా వసూలుకు పాల్పడుతుండటం రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. పత్రికల్లో వార్తలు ప్రచారం అయిన నేపథ్యంలో కొద్దిగా చర్యలు తీసుకున్నట్లు హడావుడి చేస్తారు. కానీ యదా మామూలుగా మామూళ్ల పర్వం అర్ధరాత్రి అపరాత్రి మధ్యాహ్నం సాయంత్రం వేకువ జామున అనే కొలమానం కొలతలు ఉండవు ఇక్కడ. షిఫ్టు ఏదైనా పైసలు ఇవ్వందే వాహనం ముందుకు కదలదు అనేది బహిరంగ రహస్యమే అయినప్పటికీ జిల్లాస్థాయి అధికారులు ఈ చెక్ పోస్ట్ పై దృష్టి సారించకపోవడం కూడా పాల్వంచ చెక్ పోస్ట్ సిబ్బంది అవినీతికి అడ్డు కట్ట వెయ్యలేక పోతున్నాయి. నిత్యం వసూళ్ల పర్వంతో అటవీ ప్రాంతం గిరిజన తండాలు గుండెలు వెలసిల్లేలా మదనపడి ముడుపులు ముట్ట చెప్పాల్సి రావటం అత్యంత దారుణమైన ధమనీయమైన ఉదంతంగా స్థానికులు అంటున్నారు. ఖాళీ వాహనాలను సైతం నిలుపుదల చేసి బహిరంగంగా డబ్బులు వసూలు చేస్తున్న పర్వం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందని తెలుగు రాష్ట్రాల ప్రజలు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుట్కా వ్యాపారం, గంజాయి, కలప ఏదైనా సరే పట్టింపులు ఉండవు కానీ ముడుపులు మాత్రం కచ్చితంగా సమర్పించుకోవాల్సి రావడం చెక్ పోస్ట్ అధికారుల పనితీరుకు అద్దం పడుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నెలకు లక్షలాది రూపాయలు ఆదాయం ఉన్న చెక్ పోస్ట్ లో అంతకుమించే అవినీతి సిబ్బంది జేబుల్లో చేరుతుందనేది బహిరంగ రహస్యం. అయినప్పటికీ జిల్లా స్థాయి అధికారులు తనిఖీలు చేసే ప్రత్యేక యంత్రాంగం కూడా మారుమూల ప్రాంతంలో ఉన్న చెక్ పోస్ట్ పై అంతగా దృష్టి సారించకపోవడం విశేషం. దీంతో సిబ్బంది అధికారుల అవినీతికి అంతూపంతూ లేకుండా దర్జాగా కొనసాగుతుందని పలువురు అంటున్నారు. అక్రమ మాఫియా వ్యాపారాలను అడ్డుకోవాల్సిన చెక్ పోస్ట్ సిబ్బంది సరిగా తనిఖీలు చేయకుండా అక్రమ వసూళ్లకు పెద్దపీట వేస్తున్నారని స్థానికులు సైతం ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పాల్వంచ చెక్ పోస్ట్ లో జరుగుతున్న అక్రమ వసూళ్ల పర్వం పై దృష్టి కేంద్రీకరించి సమగ్ర విచారణ చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని పలువురు వాహనదారులు తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారు.

0Shares

Related posts

రేపు వారందరికీ సెలవు ప్రకటించిన సిఈవో వికాస్ రాజ్

News Telangana

అమ్మాయి చేతిలో సీనియర్ నేత ఓటమి

News Telangana

అవసరమైతే సిట్టింగ్‌లూ చేంజ్‌ !

News Telangana

Leave a Comment