September 8, 2024
News Telangana
Image default
Telangana

అక్రమ మత్తులో రవాణా శాఖ అధికారులు..?

  • రవాణా శాఖని అంగట్లో 200 రూపాయలకు అమ్ముతున్న ఖమ్మం రవాణా శాఖ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ?
  • ఖమ్మం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నగరం నిద్రపోతున్న వేళ ఎర్ర నోటు ఇవ్వనదే పచ్చ జెండా ఉపరు ?
  • ఏసీబీ దాడులు జరుగుతున్నప్పటికీ తీరు మారని రవాణా శాఖ అధికారులు
  • దారి దోపిడీకి పాల్పడుతున్న ఖమ్మం రవాణా శాఖ అధికారులు ..?
  • లక్షల్లో జీతం సరిపోక అక్రమ ట్రాన్స్పోర్టర్ల దగ్గర నుంచి నెలవారి ముడుపులు ?
  • ఖమ్మం రవాణాశాఖలో ఫ్యాన్సీ నెంబర్‌ల కుంభకోణం ..?


ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో, ఆగష్టు 24 (న్యూస్ తెలంగాణ) :-
ప్రజాస్వామ్యంలో ఎంతో పటిష్టమైన రవాణా శాఖ ని అంగట్లో 200 రూపాయలకు అమ్ముతున్న ఖమ్మం రవాణా శాఖ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ? రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖలో ఏసీబీ దాడులు జరుగుతున్నప్పటికీ తీరు మార్చకుండా యధాతధ అక్రమవసూళ్లు దారి దోపిడీకి పాల్పడుతున్న ఖమ్మం రవాణా శాఖ అధికారులు లక్షల్లో జీతం సరిపోక అక్రమ ట్రాన్స్పోర్టర్ల దగ్గర నుంచి దగ్గర నుంచి నెలవారి ముడుపులు ? ఖమ్మం రవాణా శాఖలో ఫ్యాన్సీ నెంబర్‌ ల కుంభకోణం జోరుగా జరుగుతోంది. దీనివల్ల ప్రభుత్వానికి భారీగా గండిపడుతుంది
ఖమ్మం రవాణా శాఖ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నగరం నిద్రపోతున్న వేళ బైపాస్ లో వాహనాలను ఆపి నామమాత్రము కు పేపర్లు చెక్ చేస్తూ అన్ని సరిగా ఉన్నప్పటికీ ఎర్ర నోటు ఇవ్వనిదే పచ్చ జెండా ఉపరు. అంతేకాదు జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి పలు ఇసుక ర్యాంపుల నుంచి ఇసుక ఖమ్మం నగరానికి తరలిస్తున్న లారీల దగ్గర నుంచి నెలవారి మాముళ్ళకి పాల్పడుతున్నట్లు విశ్వసనియ సమాచారం. అర్ధరాత్రి కాపు కాసి వందలాది లారీలు ఆపి అక్రమ వసూళ్లకు పాల్పడుతూ న్యూస్ తెలంగాణ ప్రతినిధి ప్రశ్నించగా ఏమైనా కేసులు రాశారా సార్ అని అడగగా కేసులు రాయడానికి ఏముంది అక్కడ అందరూ నిబంధనల తోనే వస్తున్నారు ఒక్క లారీ ని కాంట్ట వేపించిగా ఆ లారీ సైతం బిల్ ప్రకారం సరైన లోడ్ తోనే వస్తున్నది అలా చెప్పడం విశేషం మరి ఏమిటి సార్ డబ్బులు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించగా మీకు ఎవరో తప్పుడు సమాచారం అని సమాధానం ఇవ్వడం విశేషం అంతేకాదు ఖమ్మం రవాణాశాఖలో ఫ్యాన్సీ నెంబర్‌ల జోరుగా కుంభకోణం జరుగుతోంది. దీనివల్ల ప్రభుత్వానికి భారీగా గండిపడుతుంది ఇప్పటికైనా ఖమ్మం జిల్లా కలెక్టర్ ఈ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఆఫీసర్ పై తగు చర్యలు తీసుకోవాలని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు


(వేచి చూడండి న్యూస్ తెలంగాణ ఎపిసోడ్ 2 లో ఫ్యాన్సీ నెంబర్ల జోరు)

0Shares

Related posts

ఏసీబీ కి చిక్కిన పంచాయతీరాజ్ సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ రావు

News Telangana

ఇల్లందులో కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య ఘనవిజయం

News Telangana

నేటినుండి మహాలక్ష్మి మహిళలకు జీరో టికెట్: ఆర్టీసీ ఎండి సజ్జనర్

News Telangana

Leave a Comment