September 8, 2024
News Telangana
Image default
Telangana

దేశ రాజకీయ కుట్రలో తెలంగాణ ఆడబిడ్డ బలి

  • నేడు దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును హర్షిస్తున్నాం
  • రాష్ట్రంలో బిఆర్ ఏస్ లేకుండా చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు వ్యవహరించారు మాజీ ఎంపీపీ పడగల మానస రాజు
  • ఎమ్మెల్సీ కవిత బెయిల్ మంజూరు పై తంగళ్ళపల్లి లో బిఆర్ఎస్ నాయకురాళ్లు సంబరాలు

తంగళ్లపల్లి న్యూస్ తెలంగాణ ఆగష్టు 27 :- ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను అన్యాయంగా కేసులు పెట్టి ఒక ఆడబిడ్డను ఇబ్బందులకు గురిచేసారని బిఆర్ఎస్ మాజీ ఎంపీపీ పడగల మానస విమర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు పై తంగళ్లపల్లి పట్టణంలోని బాణసంచ పేల్చి మిఠాయిలు తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈరోజు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హర్షిస్తున్నామని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయడమే లక్ష్యంగా కొంతమంది కేంద్ర ప్రభుత్వ పెద్దలు వ్యవహరించాలని దీనిని దేశ ప్రజలు గమనించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఈడి ఎమ్మెల్సీ కవితపై పెట్టిన కేసులు ఆరోపణలుగా మాత్రమే మిగిలిపోయాయని, 100 కోట్లు గాని ఇలాంటి ఆస్తులను కానీ రికవరీ చేయలేకపోయారని విమర్శించారు. ఎప్పటికైనా కవిత పై పెట్టిన కేసుల్లో న్యాయమే గెలుస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు కార్యకర్తలు పాల్గొన్నారు..

0Shares

Related posts

పెగడపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా క్యూ న్యూస్ రిపోర్టర్

News Telangana

నేటి రాశి ఫలితాలు.. ఆ రాశుల వారికి అంతా శుభమే

News Telangana

పదోవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

News Telangana

Leave a Comment