September 8, 2024
News Telangana
Image default
Telangana

మండల యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ అష్టమి జన్మదిన వేడుకలు

  • ఒగ్గు కళాకారులతో భారీ ర్యాలీ

తంగళ్ళపల్లి న్యూస్ తెలంగాణ ఆగస్టు 27 శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని తంగళ్ళపల్లి మండల యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకలు అంబరాన్నంటాయి.ఒగ్గు కళాకారుల నృత్యాలతో మండల కేంద్రంలో యాదవ సంఘం నేతలు భారీ ర్యాలీ తీశారు.తాడూరు చౌరస్తాలో ఏర్పాటుచేసిన కృష్ణాష్టమి వేడుకల్లో శ్రీకృష్ణునికి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు.ఈ సందర్భంగా యాదవ సంఘం నేతలు మాట్లాడుతూ శ్రీకృష్ణుని చల్లని చూపు ప్రజలందరిపై ఉండాలని అన్నారు.ప్రజలందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం లడ్డు వేలం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు మిరాల భాస్కర్ యాదవ్,జిల్లా యాదవ సంఘం నాయకులు బండ నరసయ్య,వీర వేణి మల్లేశం,జిల్లా యాదవ సంఘం గౌరవ అధ్యక్షుడు జేగ్గాని మల్లేశం యాదవ్, ఎస్సై దాస సుధాకర్,యాదవ సంఘం మండల అధ్యక్షుడు గోగు మల్లేశం యాదవ్,మండల యాదవ సంఘం గౌరవ అధ్యక్షుడు బండి దేవేందర్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి మందాటి తిరుపతి యాదవ్,జిల్లా నాయకులు గోట్ల ఐలయ్య యాదవ్,ఆత్మకూరి చంటి యాదవ్,మోతే మహేష్ యాదవ్,సంద వేణి మల్లేశం యాదవ్,అరకుటి మహేష్ యాదవ్,తోట్ల రాములు యాదవ్,మండల నాయకులు చరణ్ యాదవ్,శ్రీనివాస్ యాదవ్,నక్క తిరుపతి యాదవ్,జంగం శ్రీనివాస్ యాదవ్,చెన్న వేణి తిరుపతి యాదవ్,కొమురయ్య యాదవ్,లచ్చయ్య యాదవ్,శ్రీకాంత్,మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

0Shares

Related posts

దర్గా డెవలప్మెంట్ కంటూ పలు రకాలుగా వసూళ్లకు తెగబడుతున్న సిబ్బంది

News Telangana

మాజీ మంత్రి మల్లారెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు

News Telangana

ఘనంగా దొంగ మల్లన్న స్వామి జాతర

News Telangana

Leave a Comment