September 8, 2024
News Telangana
Image default
Telangana

ముస్తాబాద్ లో ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు

ఉపాధ్యాయులను సన్మానించిన విద్యార్థులు

న్యూస్ తెలంగాణ//ముస్తాబాద్
ముస్తాబాద్ మండలం కేంద్రం లో జిల్లా పరిషత్ బాలుర బాలికల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు అంబటి రవీందర్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని పాఠశాలల్లో గురుపూజోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థి విద్యార్థులకు క్విజ్ పోటీ వ్యాచారచన వంటి పోటీలు నిర్వహించి పోటీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులు పాటలతో నృత్యాలతో అలరించారు. పాఠశాల ఉపాధ్యాయులను ఉపాధ్యాయురాలను పూలమాల బహుకరించి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంబటి రవీందర్ మాట్లాడుతూ…. మన దేశానికి రెండో రాష్ట్రపతిగా ఉపాధ్యాయునిగా ఎన్నో సేవలు అందించి భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ జయంతి సందర్భంగా మా విద్యార్థిని విద్యార్థులు మా ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించడం మాకు ఎంతో గర్వించదగ్గ విషయమని వారు అన్నారు . ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంబటి రవీందర్ జిల్లా పరిషత్ బాలుల పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజిరెడ్డి ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి. ఉపాధ్యాయులు రాజు మహమ్మద్. లక్ష్మణ్. శంకరయ్య .జ్యోతి రాణి . జ్యోత్స్న . రాజేంద్రప్రసాద్. ఎల్లారెడ్డి . శ్రీనివాస్ . వీరస్వామి. గోవర్ధన్ .ఆనందం . వ్యాయమ ఉపాధ్యాయులు రాజశేఖర్. విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

0Shares

Related posts

వార్త ప్రచురణ చేసిన విలేకరిపై దుర్భాసలాడిన ఓ వైద్యుడు

News Telangana

అక్రమ “వెంచర్ల” కేటుగాళ్లు

News Telangana

నాకు తెలియకుండా ఒక్క పేపరు బయటకు పోవద్దు: సిఎస్ శాంతి కుమారి

News Telangana

Leave a Comment