November 10, 2024
News Telangana
Image default
Telangana

కోదాడ గవర్నమెంట్ హాస్పిటల్ ఆకస్మిక తనిఖీ

  • ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కృషి చేస్తా ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి
  • డాక్టర్ల కొరత సమస్యను వెంటనే పరిష్కరిస్తా

న్యూస్ తెలంగాణ, సూర్యపేట జిల్లా బ్యూరో, అక్టోబర్ 21: ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. ప్రభుత్వ వైద్యశాలను సోమవారం ఆకస్మిక తనిఖీ చేసి ఆమె మాట్లాడారు. వార్డు వార్డు తిరిగి రోగులతో మాట్లాడి వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాస్పటల్లో అవసరమైన పరికరాలు అందించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. అలాగే గర్భిణీ స్త్రీ యొక్క వివరాలు అడిగి తెలుసుకొని గర్భిణీ స్త్రీలు నార్మల్ డెలివరీ కావడానికి కావాల్సిన పలు సూచనలు ముఖ్యంగా యోగా శిక్షణ గురించి పలు సూచనలు ఇవ్వాలని తెలిపారు. అదేవిధంగా ఆస్పత్రి లోనే ఎక్కువ డెలివెరి శాతం పెంచాలన్నారు. సిబ్బంది కృషి చేయాలన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల కొరత ఉందని వెంటనే హెల్త్ కమిషనర్ తో మాట్లాడి త్వరలోనే డాక్టర్ల కొరత లేకుండా చూస్తానన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 16 మంది డాక్టర్లు ఉండేలాగా తన వంతు కృషి చేస్తానన్నారు. అనంతరం శానిటేషన్ సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకొని సిబ్బంది తక్కువగా ఉండటంతో నడిగూడెం నుండి శానిటేషన్ సిబ్బందిని డిప్యూటేషన్ మీద కోదాడకు తీసుకొస్తానని చెప్పారు. అలాగే వారికి జీతం పెంచే విధంగా కూడా కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల మౌలిక సదుపాయాలకు కృషి చేస్తామన్నారు. వంద పడకల ఆసుపత్రి ట్రేడర్ ప్రక్రియ త్వరలోనే మొదలవుతుందన్నారు. పనులు కూడా పూర్తి చేస్తామన్నారు. తక్కువ కాలంలోనే రాష్ట్రంలోనే కోదాడ ప్రభుత్వ ఆసుపత్రి బెస్ట్ ఆసుపత్రిగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, సూపర్డెంట్ డాక్టర్ దశరథ నాయక్, టిపిసిసి డెలికేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి. జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు. డాక్టర్లు నరసింహ. పద్మావతి. వైష్ణవి సుష్మా రెడ్డి మాధురి. హెడ్ నర్సు స్టాప్ నర్సు మరియు తదితరులు పాల్గొన్నారు.

0Shares

Related posts

పోలీస్ అధికారి పోలీస్ వాహనంలో ముందు సీట్లోనే కూర్చోవాలి

News Telangana

రఘునాథ పాలెం లో లోకాయుక్తా అధికారి పర్యటన

News Telangana

TSPSC చైర్మన్ గా ప్రో.కోదండరాం….?

News Telangana

Leave a Comment