December 3, 2024
News Telangana
Image default
Telangana

హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం

  • 30 మందికి గాయాలు, నలుగురి పరిస్థితి విషమం

సూర్యాపేట జిల్లా, నవంబర్ 02 / న్యూస్ తెలంగాణ :- రోడ్డు ప్రమాదం లో 30 మందికి గాయాలైన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ జాతీయ రహదారిపై కట్టకొమ్ముగూడెం రోడ్డు వద్ద శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నుంచి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు విజయవాడ వైపు వెళ్తుంది. ఈ క్రమంలోనే కోదాడ సమీపంలోకి రాగానే డ్రైవర్ విశ్రాంతి కోసం బస్సును రోడ్డు పక్కకు నిలిపాడు. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన టీఎస్ ఆర్టీసీ బస్సు ప్రైవేటు ట్రావెల్స్ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలయ్యాయి. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప కోదాడ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

0Shares

Related posts

ఉదయం 8 గంటలకు కౌంటింగ్ : ఈసీ

News Telangana

మీకు ఓటర్ స్లిప్ అందలేదా ? ఇలా పొందొచ్చు !

News Telangana

ముస్తాబాద్ లో ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు

News Telangana

Leave a Comment