హైదరాబాద్, డిసెంబర్ 14 ( News Telangana ) :-
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం అసెంబ్లీలో స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ పేరును ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీ ఓవైసీ అధికారికంగా ప్రకటించారు. స్పీకర్ స్థానంలో ఆశీను లయ్యారు. స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతలు అభినం దనలు తెలిపారు. అనంతరం సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను గౌరవ పూర్వకంగా ఆయన కుర్చీలో కూర్చోబెట్టారు. అనంతరం వరుసగా ఎమ్మెల్యేలు స్పీకర్ చైర్ వద్దకు వచ్చి ప్రసాద్ కుమార్‌కు అభినందనలు తెలియజేశారు. అనంతరం స్పీకర్‌కు ధన్యవాదాల తీర్మానంపై సభ్యులు మాట్లా డనున్నారు
previous post