- కేక్ కట్ చేసిన చిన్నారులు
మద్దూరు నవంబర్17(న్యూస్ తెలంగాణ)
మద్దూరు మండలంలోని లద్నుర్ బెతనీయ ప్రార్దన మందిరం పాస్టర్ రెవ.టి డేవిడ్ ఆధ్వర్యంలో ఆదివారం ఈ నేల 25న క్రీస్తు జన్మ దినాన్ని పురస్కరించుకుని ముందుగా సండేస్కూల్ పిల్లలు మినీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు.ఈ సంధర్భంగా కేక్ కట్ చేసి చిన్నారులు, పెద్దలు ఒకరినొకరు తినిపించుకున్నరు.అనంతరం పాస్టర్ డేవిడ్ క్రీస్తు జన్మతోనే సర్వ మానవాళి పాపాలు క్షేమించబద్దయన్నరు.మనం చేసిన ప్రతి పాపం కొరకు నలుగా గొట్టబడి మూడు రోజులు సమాధిలో ఉంచబడి తిరిగి లేచిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు మాత్రమే అన్నారు. అంతటి త్యాగపూరిత దేవుని జన్మదినం మనం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.అదే విదంగా పాస్టర్ డేవిడ్ కూతురు ప్రతి సంవత్సరం విధాల కోసం అందించిన చీరలను పాస్టర్, సంఘ నాయకులు పంపిణి చేశారు.ఈ కార్యక్రమంలో సండే స్కూల్ టీచర్స్ ప్రవలిక, కృప, సోని, అపురూప,సంఘా నాయకులు ఏలీయా,రాజు,జాకబ్,మహిళలు, సంఘస్తులు పాల్గొన్నారు.