July 26, 2024
News Telangana
Image default
PoliticalTelangana

కొత్త రేషన్ కార్డులు, పింఛన్ల కోసం 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ

  • గ్రామాల్లోనే ఎంపిక

తేలంగాణలో ఏళ్లుగా గంపెడాశలతో ఎదురుచూస్తున్న పేదల కల తీరబోతోంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్తగా కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 28 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. దీంతో పాటు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులూ, తప్పులు సరిచేయడం తదితర అంశాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 28 నుంచి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తామని, కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు, హౌసింగ్‌పై గ్రామ సభలో నిర్ణయం మేరకు లబ్ధిదారులను ఎంపిక చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రేషన్ దుకాణాల్లో పంపిణీ చేసే బియ్యం పక్కదారి పట్టకుండా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చారు.

0Shares

Related posts

24 మంది ఎమ్మెల్యేల ఎన్నికపై సవాల్‌!

News Telangana

నేడు ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ విడుదల చేసిన తెలంగాణ సర్కార్

News Telangana

మనస్థాపానికి గురై యువతి ఆత్మహత్య

News Telangana

Leave a Comment