- స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ పోలోజు రాజ్ కుమార్
మద్దూరు ఫిబ్రవరి10(న్యూస్ తెలంగాణ)
తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ
విరాట్ విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక ధార్మిక కళాపరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు వెలుగు ఉగాది సాహితీ సాంస్కృతిక ఉత్సవాలు-2024ను పురస్కరించుకొని వివిధ రంగాల్లో కృషి చేసిన వారి నుండి తెలుగు వెలుగు ఉగాది మహానంది మరియు ఉగాది మయూరి జాతీయ పురస్కారాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాం
తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ తమిళనాడు ఒరిస్సా కర్ణాటక మరియు మహారాష్ట్రకు చెందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని
తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ బ్రహ్మశ్రీ పోలోజురాజ్ కుమారా చార్యులు
జాతీయ అధ్యక్షులు డాక్టర్ రంగిశెట్టి రమేష్ నిర్వహణ కమిటీ చైర్మన్
శ్రీ మానుపాటి ప్రదీప్ కుమార్
ఒక ప్రకటనలో తెలిపారు సాహిత్యం. రచన. కవులు. కళాకారులు .సంగీతం. నృత్యం .భరతనాట్యం. కూచిపూడి కోలాటం చిత్రలేఖనం. శిల్పం. నాటకం .జానపదం. మిమిక్రీ .అవధానం. విద్య .వైద్యం. ఇంద్రజాలం. ముకాభినయం .హరికథ .బుర్రకథ .ఒగ్గు కథ. రంగస్థలం కళాకారులు. జ్యోతిష్యం .వాస్తు. పురోహితం. సైన్స్ అండ్ టెక్నాలజీ .యోగ డోలక్ .హార్మోనియం. భజన కళా సామాజిక సేవా,క్రీడాలు ,షార్ట్ ఫిలిం ,ఉపాధ్యాయులు, ఉద్యోగులు. విద్యార్థులు. మహిళా యువజన సంఘాలు. పర్యావరణ పరిరక్షణ. గ్రామీణాభివృద్ధి. గ్రామ మరియు పట్టణ ప్రజాప్రతినిధులు మరియు వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారు ఈ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవచ్చని నిర్వాహకులు తెలియజేశారు ఈ పురస్కారాలకు చివరి తేదీ 20 మార్చి 2024 లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు తెలుగు వెలుగు ఉగాది జాతీయ పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమం తెలంగాణలోని హైదరాబాద్ మరియు ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలులో రెండు రాష్ట్రాల్లో ఏప్రిల్ నెలలో జరుగును
పూర్తి వివరాలకు ఈ కింది ఫోన్ నెంబర్లను సంప్రదించగలరు
9100174351.9441261585