September 14, 2024
News Telangana
Image default
Sports News

తుది సమరానికి ఆస్ట్రేలియా భారత్ నేడు సిద్ధం

బెనోని:ఫిబ్రవరి 11 ( News Telangana ) :- ప్రతిష్ఠాత్మకమైన అండర్19 వన్డే ప్రపంచకప్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధ మైంది. ఆదివారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపి యన్ టీమిండియా మాజీ విజేత ఆస్ట్రేలియాతో తలపడుతుంది. రెండు జట్లలోనూ ప్రతిభావం తులైన ఆటగాళ్లకు కొదవలేదు. సౌతాఫ్రికా వేదికగా జరుగు తున్న ఈ మెగా టోర్నమెంట్‌ లో భారత్ వరుస విజయా లతో ఫైనల్‌కు చేరింది.ఈ క్రమంలో ఒక్క సౌతాఫ్రి కాతో జరిగిన సెమీ ఫైనల్లోనే టీమిండియాకు కాస్త పోటీ ఎదురైంది. లీగ్ దశతో పాటు సూపర్6 లో భారత్ అలవోక విజయాలను అందుకుంది.ఒక్క ఓటమి కూడా చవి చూడకుండానే ఫైనల్‌కు అర్హత సాధించింది. ఫైనల్లో కూడా అదే జోరును కొనసా గించాలనే పట్టుదలతో ఉంది. తుది పోరులో ఆస్ట్రేలియాను ఓడించి ఆరో ప్రపంచకప్ ట్రోఫీని ముద్దా డాలని భావిస్తోంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియాతో రెండు సార్లు ఫైనల్‌లో భారత్ తలపడింది.రెండు సార్లు టీమిండియానే విజయం సాధించింది. ఈసారి కూడా ఆస్ట్రేలియా ను ఓడించి ప్రపంచ ఛాంపి యన్‌గా నిలువాలనే లక్ష్యం తో పోరుకు సిద్ధమైంది. అంతేగాక పాకిస్థాన్ తర్వాత వరుసగా రెండు ప్రపంచకప్ ట్రోఫీలు గెలిచిన జట్టుగా నిలువాలనే పట్టు దలతో కనిపిస్తోంది. ఇప్పటి వరకు పాకిస్థాన్ మాత్రమే వరుసగా రెండు సార్లు ప్రపంచకప్ ట్రోఫీని గెలిచింది. భారత్‌కు ఈసారి ఆ రికార్డును సమం చేసే అవకాశం దక్కింది.వరుస విజయాలతో..ఈ వరల్డ్‌కప్‌లో టీమిండి యా వరుస విజయాలతో పెను ప్రకంపనలు సృష్టి స్తోంది. లీగ్ దశలో ఆడిన అన్ని మ్యాచుల్లోనూ జయకేతనం ఎగుర వేసింది. సూపర్ సిక్స్‌లో కూడా అజేయంగా నిలిచింది. సెమీస్‌లో బలమైన సౌతాఫ్రికాను ఓడించి ఫైనల్‌కు చేరింది.బ్యాటింగ్, బౌలింగ్ విభా గాల్లో టీమిండియా సమ తూకంగా ఉంది. ఓపెనర్లు ఆదర్శ్ సింగ్, అర్షిన్ కుల్‌కర్ణి, ముషీర్ ఖాన్, కెప్టెన్ ఉదయ్ సహరన్, ప్రియాన్షు మోలియా, సచిన్ దాస్, వికెట్ కీపర్ అవనిష్ తదితరులతో భారత బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉంది. ముషీర్ ఖాన్ ఇప్పటికే రెండు సెంచరీలతో సత్తా చాటాడు.ఉదయ్, సచిన్, ఆదర్శ్ తదితరులు కూడా అసాధారణ బ్యాటింగ్‌తో జట్టు విజయాల్లో తమవం తు పాత్ర పోషిస్తున్నారు. సమి,పాండే అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకుంటు న్నాడు. రాజ్ లింబాని, మురుగన అభిషేక్, అర్షిన్ కులకర్ణి, ప్రియాన్షులతో బౌలింగ్ విభాగం కూడా బలంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది

0Shares

Related posts

తాత ఆస్తిపై మనువడే హక్కుదారుడా? అసలు విషయం తెలిస్తే షాక్‌..

News Telangana

సంక్రాంతి పండగ సందర్బంగా క్రికెట్ టోర్నమెంట్

News Telangana

Leave a Comment