- స్పందించని అధికార యంత్రాంగం
- ముగ్గురు మంత్రుల ఇలాకాలో ఆగని ఇసుకాసురులు
- దీనిపై వివరణ ఇవ్వడానికి సైతం సంబంధిత అధికారులకు సమయం లేకుండా కాంట్రాక్టర్లతో బిజీ
- ఈ ఇసుకసురులకు అడ్డుకట్ట వేసేది ఎవరు?
- అక్రమ వసులకు పాల్పడుతున్న అధికారులపై చర్యలు ఏవి ?
- లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను మాయం చేసిన మైనింగ్ మరియు టిఎస్ఎండిసి అధికారులు
- టిఎస్ఎండిసి అధికారులకు కాంట్రాక్టర్లతో పని ఏంటి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం
సాంబయిగూడెం 1 సాంబాయిగూడెం 976 థమక్కపేట మరియు రామానుజరం ఇసుక ర్యాంపులలో వారి యొక్క పరిధి ప్రకారం కాకుండా అక్రమంగా గోదావరిలో నుంచి ఇసుక తవ్వకాలు జరిపినట్లు ఆ యొక్క గ్రామ ప్రజలు తెలియజేయడం జరుగుతున్నది దీనిపై టిఎస్ఎండిసి అధికారులకు మైనింగ్ అధికారులకు ఎన్నో ఫిర్యాదులు అందిన కాంట్రాక్టర్ల యొక్క మామూలు మత్తులో మునిగిపోయిన అధికార యంత్రాంగం పైచర్యలు తీసుకునేది ఎవరు ఇప్పటికైనా టిఎస్ఎండిసి MD కాంట్రాక్టర్లు మరియు సంబంధిత జిల్లా అధికారులపై చర్యలు తీసుకొని పూర్తిస్థాయి వివరణ తర్వాతనే వారి యొక్క బిల్లులని మంజూరు చేయగలరని కోరుతున్న ప్రజలు పూర్తిస్థాయి విచారణ జరిగేంత వరకు సంబంధిత క్వారీలను నిలిపివేసి ఆ యొక్క సంబంధిత కాంట్రాక్టర్లపై అధికారులపై చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేయకూర్చగలరు అని మణుగూరు మండల ప్రజలు కోరుకుంటున్నారు.
(వేచి చూడండి న్యూస్ తెలంగాణ ఎపిసోడ్ 3 లో )