- భారీగా చేతి వాటం చూపిస్తున్న చెకపోస్ట్ సిబ్బంది
- కాసుల కోసమే రాబందుల ఎదురుచూస్తున్న సిబ్బంది
- చెకపోస్ట్ రూల్స్ అంతా డిఫరెంట్ ..?
- అధికారుల పర్యవేక్షణ కరువు తూతూ మంత్రంగా తనిఖీలు
- ఇంత అవినీతిలో అధిరుల వాటాలు .. నాయకులకు ముడుపులు
- అంతా “శంఖరుడి” లీలలు
( పూర్తి ఆధారాలతో “న్యూస్ తెలంగాణ దినపత్రిక” లో వరుస సంచలనాత్మక కథనాలు )
స్టేట్ క్రైమ్ బ్యూరో, మే 15, (న్యూస్ తెలంగాణ ) :-ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి చెక్ పోస్ట్ లో అవినీతి అంత ఇంతా కాదు అక్రమ వసూళ్లు ధ్యేయం గా భారీగా చేతి వాటం చూపిస్తున్న చెకపోస్ట్ సిబ్బంది చెకపోస్ట్ వారు పెట్టుకున్న సొంత రూల్స్ తెలవక నేరుగా పేపర్స్ తీసుకొని వెళితే కొర్రీలే. చెకపోస్ట్ పేరిట భారీగా దందా చేస్తున్నప్పటికి ఇదంతా అధికారికి తెలవదా ? నామ మాత్రం కె తనిఖీలు అనేది వట్టి మాట అసలు మా దగ్గర తనిఖీలే ఉండవు. నా చెక్ పోస్ట్ కి నేనే రాజు నేనే మంత్రి నా రూల్స్ నా ఇష్టం నేను ఎంత చెబితే అంత ఇవ్వాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తున్న ఆర్టిఏ అధికారులు. ఏ ఒక్క ఆర్టిఏ సిబ్బంది కూడా వెళ్లి నేరుగా లారీని ఆపి పేపర్స్ చెక్ చేసేది ఎం ఉండదు ప్రతి చిన్న వాహనాలని పిండి కొద్ది రొట్టి అన్నట్లుగా రేట్ ఫిక్స్ చేసి వసూళ్లకు అడ్డాగా మార్చుకున్నారు వాహనంలో ఏమున్నదో పక్కన పెడితే కనీసానికి వాహనానికి పేపర్స్ ఉన్నవా లేవా అని చెక్ చేయడానికి సిబ్బందికి తీరికలేదు. అక్రమ వసుల్లతోనే టైం సరిపోతుంది
( తరువాయి భాగం వేచి చూడండి త్వరలో ఎపిసోడ్ 2 లో న్యూస్ తెలంగాణ )