శ్రీశైలం దేవరశెట్టి మరిపెడ డిసెంబర్ 4 న్యూస్ తెలంగాణ
ప్రజాతీర్పు గౌరవిస్తాం గెలిచిన అభ్యర్థుల కు అభినందనలు తెలంగాణ రాష్ట్రం లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తీర్పును శిరసవహిస్తామని జిల్లా బీ ఆర్ ఎస్ అధ్యక్షురాలు ఎంపీ మాలోతు కవిత అన్నారు. సోమవారము మరిపెడ మున్సిపల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ కవిత , జిల్లా గ్రంధాలయ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు తో కలసి మాట్లాడారు. గెలిచిన అభ్యర్థుల కు అభినందనలు తెలిపారు. లోటుపాట్లపై పునః సమీక్ష చేసుకుని పార్టీ శ్రేణులకు ప్రజలకు అందుబాటులో ఉండి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాం అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అరుణరాంబాబు, జడ్పీటీసీ శారద రవీంద్ర నాయక్, మాజీ ఒడిసిమెస్ చైర్మెన్ కుడితి మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ ముదిరెడ్డి బుచ్చి రెడ్డి, అచ్యుతరావు,ఉప్పల నాగేశ్వర రావు, ఫానుగొతు వెంకన్న, సయ్యద్ లతీఫ్, మక్సుద్ లు పాల్గొన్నారు.