బెంగళూరు , డిసెంబర్ 09 ( News Telangana ) :-
చలన చిత్ర పరిశ్రమలో విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. బాలీవుడ్ కమెడియన్ జూనియర్ మోహముద్ మరణ వార్త నుంచి ఇంకా తేరుకోక ముందే.. మరో సీనియర్ నటి ఈ రోజు కన్ను మూశారు. సినీ పరిశ్రమలో అతి సుదీర్ఘమైన కెరీర్ లో సుమారు ఐదు దశాబ్దాల పాటు నటించిన నటి లీలావతి (85) కన్ను మూశారు.ఆమె ఆరోగ్య రీత్యా ఏర్పడిన అనారోగ్య సమస్యలతో కర్ణాటకలోని నీలమంగళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, ఆమె శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. లీలావతి సుదీర్ఘమైన సినీ కెరీర్ లో 600లకు పైగా సినిమాల్లో నటించారు. సినిమాలతో పాటు, థియేటర్ లో నాటకాల్లో కూడా నటించారు. తన కెరీర్‌లో కన్నడ, తమిళ, తెలుగు చిత్రాల్లో నటించి తన నటనతో మెప్పించారు. కర్ణాటక బెల్తంగడి జిల్లాలో జన్మించిన ఆమె అసలు పేరు లీలా కిరణ్. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను ఎదుర్కొంది. 6 సంవత్సరాల వయస్సులో తల్లిదండ్రులను పోగొట్టు కున్న లీలావతి నటిగా మారి.. తనదైన నటనతో పెద్ద ఆర్టిస్ట్‌గా ఎదిగారు. ఆమె కుమారుడు వినోద్ రాజా కూడా ఒక నటుడే.. కుమారుడితో కలిసి లీలావతి నివస్తుంది.