సిరిసిల్ల జిల్లా, డిసెంబర్ 14 (News Telangana ) :-
సిరిసిల్ల జిల్లాలో గురువారం మధ్యాహ్నం దారుణం చోటు చేసుకుంది. భూ తగాదాలతో ఓ యువకుడిని గొడ్డలితో అత్యంత దారుణంగా హతమార్చడం స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే తంగళ్లపల్లి మండలం నర్సింహుల పల్లెలోని,త్యాగ రాకేష్ (25)ని అతడి చిన్నమ్మ కొడుకు త్యాగ తిరుపతి గొడ్డలితో నరికి చంపాడు. రాకేష్ హత్యకు భూతగా దాలే కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు. సమా చారం అందుకున్న పోలీ సులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాకేష్ మరణంతో నర్సింహులపల్లె లో గురువారం విషాద ఛాయలు అలుము కున్నాయి.
previous post