మద్దూరు డిసెంబర్14(న్యూస్ తెలంగాణ) మద్దూరు మండలంలోని లద్నూర్ గ్రామంలోని ఓ రైతు వరి పొలాన్ని ఏ ఓ రామక్రిష్ణ సందర్శించారు. ఈ సంధర్భంగా అయన మాట్లాడుతు యాసంగి సీజన్లో చలి ప్రభావం వల్ల వరి నాడుమరులో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి .ముఖ్యంగా సాయంత్రం వేళలో నారుమడిలో నీరు తీసివేసి పగటిపూట వెచ్చట నీరు పెడుతూ ఉండాలి. అలాగే నారు ఆరోగ్యంగా పెరగడానికి యూరియా వేస్తున్నప్పుడు ఒక కిలో యూరియాకి రెండు గ్రాముల కార్బన్డిజం మరియు మ్యాంగో జెబ్ మిశ్రమ మందును కలిపి పిచికారి చేయాలి …. చలి తీవ్రత ఎక్కువగా ఉండి మంచుతో కూడిన వాతావరణం ఉన్నచో అగ్గి తెగులు ఆశించకుండా ముందు జాగ్రత్తగా ట్రై సైక్లోజోల్ 0.6 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి అలాగే జింకు లోపం వలన ఆకులపై మచ్చలు ఏర్పడినప్పుడు జింక్ సల్ఫేట్ రెండు గ్రాములు లీటర్ కలిపి పిచికారి చేయాల…పై తెలిపిన సస్యరక్షణ చర్యలు తప్పకుండా రైతులు నారుమడిలో పాటించాలి ఈ కార్యక్రమంలో ఏఈఓ అఖిల్ రైతులు పాల్గొన్నారు.
previous post