News Telangana :- తెలంగాణ రాష్ట్రంలో పరిపాలించిన గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, ఆర్థిక దుబారాను, ప్రజా ధనం దుర్విని యోగాన్ని ఎత్తి చూపేందుకు స్వయం గా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో అన్ని శాఖలు, కార్పొరేషన్ల వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ నెల 14 నుంచి ప్రారంభ మయ్యే అసెంబ్లీ సమా వేశాల్లో తొలి మూడు రోజుల షెడ్యూలు తర్వాత ఇందుకు ప్లాన్ చేసినట్టు తెలిసింది. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక వ్యవస్థ కుదేలైన తీరు, చివరకు ప్రభుత్వ ఉద్యో గులకు సైతం సకాలంలో జీతాలు చెల్లించలేని దుస్థితి ఎందుకు తలెత్తిందో? ఈ ప్రజెంటేషన్ ద్వారా వివరించాలని ముఖ్య మంత్రి భావిస్తున్నారు. కేసీఆర్ పాలనలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందంటూ గతంలో కాంగ్రెస్, బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాయి. తాజాగా ఆయా శాఖల అధికారుల నుంచి తీసుకున్న గణాంకాలను సభ్యులతో పాటు ప్రజలం దరికీ వీటిని వివరించేందుకు సర్కారు సిద్ధమైనట్టు టాక్. ఏయే శాఖలో ఏ రూపంలో ప్రజాధనం దుర్వినియోగమైందో లెక్కలతో సహా వివరించి అసెంబ్లీ రికార్డుల్లోకి ఎక్కేలా చూడాలని భావిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీతో వివిధ కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాలు నిర్దిష్టంగా ఆ అవసరాలకు వినియోగించకుండా డైవర్ట్ చేయడం, అప్పులు తీర్చ డానికి పడుతున్న తిప్పలు ఇలాంటి వివరా లన్నింటినీ ఆ ప్రజెంటేషన్‌లో ప్రభుత్వం పొందుపర్చాలని భావిస్తున్నది.
- జీతాలు ఇవ్వలేని దుస్థితి., ఎందుకొచ్చింది?
తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎలా ఉన్నది? బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఎలా మారింది? ఎంత అప్పు పెరిగిందనే విషయాలను సర్కారు వివరించాలనుకుంటున్నది. ఒక్కో స్కీమ్‌కు అవుతున్న ఖర్చును తేటతెల్లం చేస్తూ పదేండ్లలో వాటిక వసర మయ్యే వనరుల సమీకరణ కోసం చేసిన అప్పులు, మొత్తం ఆర్థిక వ్యవస్థనే దివాలా తీయించిన విధానాన్ని వివరించాలని ప్లాన్ చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఏయే రూపాల్లో ఎక్కడి నుంచి ఎంత అప్పు తీసుకున్నది.. వాటికి ప్రతి నెలా చెల్లిస్తున్న వడ్డీ, అసలు’ రీపేమెంట్, కార్పొరేషన్ల ద్వారా తీసు కున్న రుణాలు, వాటి ద్వారా అవి కూడా నష్టాల్లోకి, అప్పుల్లోకి కూరు కుపోవడం..ఇలాంటి అనేక అంశాలను బహిర్గతం చేయాలనుకుంటున్నది. ఏటా ఎక్కడి నుంచి అప్పు తీసుకున్నది? ఏ అవస రాలకు దానిని ఖర్చు పెట్టింది..దాని ద్వారా ఎలాంటి ఫలాలు అందు తున్నాయి? వాటిని తీర్చడానికి ఉన్న మార్గమేంటి..? ఆర్థిక దుబారా ఎక్కడెక్కడ జరిగింది? ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి ఎందుకు తలెత్తింది? ప్రజలపై తలసరి అప్పు భారం ఏ మేరకున్నది? చివరకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎలాంటి సంక్షో భంలోకి కూరు కుపోయింది. అనే విషయాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో స్వయంగా ముఖ్యమంత్రే వివరిస్తారని సచివాలయ వర్గాల సమాచారం. ఇంకోవైపు ప్రభుత్వరంగ సంస్థలు కార్పొరేషన్లుఏ అవసరం కోసం ఎంత అప్పు తీసుకున్నాయి? అవి ఎటువైపు డైవర్ట్ అయ్యాయి? వాటిని ఏ తీరులో వినియోగించింది? ఎప్పటికల్లా వాటిని తీర్చాల్సి ఉంటుంది? అనే విషయాలను సీఎం ప్రస్తావించనున్నారు