పెద్దపల్లి జిల్లా, డిసెంబర్ 14 ( News Telangana ) :-
ప్రమాదవశాత్తు రైలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ లో గురువారంచోటు చేసుకుంది. గురువారం పెద్దపల్లి పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు యాకూబ్, రాజులు, రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫామ్ దిగి రైల్వే ట్రాక్ దాటుతుండగా తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమా చారం అందుకున్న రైల్వే అధికారులు, పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు
previous post