హైదరాబాద్, డిసెంబర్15 ( News Telangana )
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ అనా రోగ్యం కారణంగా గత ఎని మిది రోజులుగా రోజులుగా సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందు తున్న విషయం తెలిసిందే. కాగా.. కేసీఆర్ ఈరోజు డి శ్ఛార్జ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో.. కేసీఆర్ ఆస్ప త్రి ఖర్చులపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా కీలక ప్రకటన చేశారు. కేసీఆర్‌కు వైద్య ఖర్చులన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే చెల్లి స్తుందని దామోదర రాజ నర్సింహా పేర్కొన్నారు. గురువారం రోజున అసెం బ్లీలోని ఆయన ఛాంబర్‌లో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన.. కేసీ ఆర్ అనారోగ్యం పాలవడం దురదృష్టకరమని సాను భూతి వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేక అధికారిని కూడా నియమించినట్టు తెలిపారు. అయితే..కేసీఆర్ చికిత్సకు సంబంధించిన బిల్లులన్ని తమ ప్రభుత్వమే భరి స్తుందని తెలిపారు.
previous post