ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి సమక్షంలో చేరికలు
కాసాల ఉపసర్పంచ్ స్వప్న మహేష్ కాంగ్రెస్ గూటికి
న్యూస్ తెలంగాణ హత్నూర ప్రతినిధి:
మండల పరిధిలోని కాసాల గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ స్వప్న మహేష్ హస్తం గూటికి చేరుకున్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి నర్సాపూర్ లో రాజిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ మోసపూరిత పరిపాలన చేస్తుందని ఉద్దేశంతోనే పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ లోకి వస్తున్నారని అన్నారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయంతో అధికారం చేజిక్కించుకోవడం తెలంగాణలో తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అనే పేరు నామరూపాలు లేకుండా పోతుందని కాంగ్రెస్ పార్టీలోకి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పలువురు చేరారు. ఈ కార్యక్రమంలో కాసాలగ్రామ అధ్యక్షులు వెంకటేష్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు అంజనేయులు గౌడ్ దౌల్తాబాద్ సర్పంచ్ వెంకటేష్, స్వామి గౌడ్, ఆశన్న, రామచందర్, ఎండి ఖాజా, బిక్షపతి, ఆంజనేయులు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.