మరిపెడ మున్సిపాలిటీ లో బీఎస్పీ ప్రచారం
బీఎస్పీ పార్టీకి అవకాశం ఇవ్వండి.
భారీ మెజార్టీతో గెలిపించండి
- డోర్నకల్ బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి గుగులోత్ పార్వతి రమేష్ నాయక్
శ్రీశైలం దేవరశెట్టి మరిపెడ ప్రతినిధి నవంబర్ 28 న్యూస్ తెలంగాణ
మానుకోట జిల్లామరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి గుగులోత్ పార్వతి రమేష్ నాయక్ రోడ్ షో నిర్వహించి ఓట్లను అభ్యర్థించారు.
ఈ సందర్భంగా బిఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి గుగులోత్ పార్వతి రమేష్ నాయక్ మాట్లాడుతూ డోర్నకల్ నియోజకవర్గంలో బహుజనులకు రాజ్యాధికారం సాధించుటకు బీసీ,ఎస్సీ,ఎస్టి,మతమైనారిటీలు అగ్రకుల పేదలు ఏకమవుతున్నారని తెలిపారు.డోర్నకల్ గడ్డ బహుజనుల అడ్డా, ఏనుగు గుర్తుపై ఓటేసి నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే డోర్నకల్ లో నీలి జెండా ఎగరేసి సమగ్రంగా అభివృద్ధి చేస్తానని కోరారు.
డోర్నకల్ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల ప్రజలే అధికంగా ఉన్నారు కావున బీఎస్పీ పార్టీకి అవకాశం కల్పిస్తే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు.కళ్ల ముందు కదులుతున్న రంగుల జెండాలను గమనించి పేదోడికి న్యాయం చేసే పార్టీ అయినా బీఎస్పీకి ఒక్క అవకాశం కల్పించాలన్నారు.లంబాడీల సామాజిక వర్గం నాయకులు ఏ పార్టీ నుండి గెలిచినా కూడా అందులో అధికారం చెలాయించేవారు అగ్రకులాల వారే ఉంటారన్నారు.కావున ప్రతి ఓటరు బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా నాయకులు ఐనాల పరశురాములు,మండల పార్టీ అధ్యక్షులు,డోర్నకల్ నియోజకవర్గ నాయకులు, మహిళా నాయకులు ఇంకా తదితరులు పాల్గొన్నారు.