– 12 గోల్డ్ మెడల్స్ సాధించిన టేకులపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థినిలు
ఖమ్మం టౌన్ : ఖమ్మం నగరం షాధిఖనలో జరుగనున్న పల్లా జాన్ రాములు మెమోరియల్ నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్-2023 ను రవాణా శాఖ మంత్రి, ఖమ్మం బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు.కరాటే మాస్టర్ ఎం.డి గఫూర్ ఆధ్వర్యంలో చాంపియన్షిప్ లో పాల్గొనే క్రీడాకారులకు పువ్వాడ అభినందనలు తెలిపారు.పల్లా జాన్ రాములు కుమారుడు పీస్ కమిటీ చైర్మన్ పల్లా రాజశేఖర్ అధ్వర్యంలో జరగిన కార్యక్రమంలో నాయకులు అమరగని వెంకన్న, కరాటే మాస్టర్స్, క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.తదనంతరం జరిగిన కరాటే పోటీల్లో టేకులపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల విద్యార్థినిలు ఉత్తమ ప్రదర్శన కనబరచి 12గోల్డ్ మెడల్స్ సాధించారు.మెరుగైన ప్రదర్శన చేసిన విద్యార్థినిలు పి.శ్రీవల్లి, వి.హర్షిత, టి.పున్యశ్రి, బి.దెబొర, ఎం.సుప్రియ, కె.సర్ష్మిత, పి.అక్షయ, కె.బిందు, కె.రణశ్రి, బి.దివ్య, వి.వర్షిత,టి.శ్రావణిలను అలాగే కరాటే మాస్టర్ రామకృష్ణను టేకులపల్లి గురుకుల ప్రిన్సిపాల్ మైథిలి, వైస్ ప్రిన్సిపాల్ రమేష్ అభినందించారు.