September 15, 2024
News Telangana
Image default
Telangana

ఖమ్మం జిల్లా కేంద్రంలో గంజాయి చాక్లెట్లు స్వాధీనం

ఖమ్మం జిల్లా , జనవరి 30 ( News Telangana ) :-
హైదరాబాద్‌ శివార్లలోని నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కోకాపేట ప్రాంతంలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న ఉదంతం మరవక ముందే.. తాజాగా ఖమ్మం లో గంజాయి చాకెట్లు లభించడం ఆందోళన కలిగిస్తున్నాయి.

ఖమ్మంలో నిందితుల నుంచి మూడు కిలోల గంజాయి చాక్లెట్లను పోలీసులు ఈరోజు స్వాధీనం చేసుకున్నారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, హైదరాబాద్‌ శివార్లలోని నార్సింగిలో గంజాయి చాకెట్లు కలకలం సృష్టించాయి.

నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కోకాపేట ప్రాంతంలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తిని ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని ఒడిశాకు చెందిన సౌమ్యా రాజన్‌గా గుర్తించారు.

అతని నుంచి 40 గంజాయి ప్యాకెట్లను సాధీనం చేసుకున్నారు. భవన నిర్మాణ కార్మికులకు చాక్లెట్లను అమ్ముతుండగా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు.

కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తు చేస్తున్నామని చెప్పారు. వాటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడనే విషయమై ఆరాతీస్తున్నారు

0Shares

Related posts

ఉరుములు, పిడుగులతో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

News Telangana

నూతన గృహప్రవేశం చేసిన ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క

News Telangana

కొత్త రేషన్ కార్డులు, పింఛన్ల కోసం 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ

News Telangana

Leave a Comment