పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన ఖమ్మం వన్ టౌన్ పోలీసులు
ఖమ్మం ప్రతినిధి, నవంబర్ 28 ( న్యూస్ తెలంగాణ):
సీనియర్ జర్నలిస్టు, ఆంధ్రప్రభ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్, ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు , టి యు డబ్ల్యూజే (ఐ జే యు) జర్నలిస్ట్ యూనియన్ ఖమ్మం సిటీ అధ్యక్షుడు మైస పాపారావు పై వ్యక్తిగతంగా , ఆయన వ్యక్తిత్వాన్ని, జర్నలిస్టు వృత్తిని కించపరిచే రీతిలో సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో బ్లాక్మెయిలింగ్, బెదిరింపు ధోరణుల కు పాల్పడి తప్పుడు పోస్టింగులు పెట్టిన పత్తి శ్రీనివాస్ అనే వ్యక్తి పై పలు సెక్షన్ల కింద ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదుచేశారు. బ్యూరో చీఫ్ గా తన ఉద్యోగ బాధ్యతలు, జర్నలిస్టు వృత్తి నిర్వహణలో భాగంగా ఆంధ్ర ప్రభ పత్రిక లో పరిశీలనాత్మక కథనాలు రావడంతో పత్తి శ్రీనివాస్ అనే వ్యక్తి కి సంబంధం లేకున్నప్పటికీ ఆ వార్తలను జీర్ణించుకోలేక పాపారావు పై వ్యక్తి గతంగా తప్పుడు ఆరోపణలు, బెదిరింపులు చేయడంతో జర్నలిస్టు పిర్యాదు మేరకు ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో 321/2023 ప్రకారం ipc సెక్షన్లు 204-B, 504, 506 కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.
previous post
next post