కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి ఆశీర్వదించండి
బి ఆర్ఎస్ పార్టీ పాలేరు ఎమ్మెల్యే అభ్యర్థి కందాళ
నేలకొండపల్లి ప్రతినిధి న్యూస్ తెలంగాణ నవంబర్ 28
నేలకొండపల్లి మండల పరిధిలోని ముజ్జు గూడెం గ్రామంలో తాజా ఎమ్మెల్యే బి ఆర్ఎస్ పార్టీ పాలేరు అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ గులాబీ జెండా నిరుపేదలకు అండగా నిలిచిందని కెసిఆర్ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పేదల జీవితాలలో వెలుగులు నింపేందుకు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పథకాలను రాష్ట్రంలో అమలు చేశారన్నారు. రైతుబంధు రైతు బీమా కేసీఆర్ కిట్లు దళిత బంధు లాంటి పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కేసిఆర్కే దక్కుతుంది అన్నారు. పేదలకు మరింత సాగు సేవ చేసేందుకు పాలేరును సమగ్ర అభివృద్ధి చేసేందుకు గాను మరోసారి కారు గుర్తుపై ఓటు వేసి దీవించాలని ఆయన ప్రజలను కోరారు. ముజ్జుగూడెం గ్రామ ప్రజలు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఉన్నంబ్రహ్మయ్య వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నంబూరి శాంత తో పాటు పలువురు సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు.
previous post