January 23, 2025
News Telangana
Image default
Telangana

కోదాడ లో ఘరానా మోసం… సీఐ, ఎస్ఐ అంటూ టోకరా

  • సిఐ అని ఒకరు….! ఎస్సై  అని ఒకరు చెప్పి నగదు టోకరా….

న్యూస్ తెలంగాణ మే 18 కోదాడ:

కోదాడ మండల పరిధిలోని దొరకుంట శివారులో ఇద్దరు వ్యక్తులు ఓ వ్యక్తిని బెదిరించి డబ్బులు తీసుకున్న సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామానికి చెందిన  సయ్యద్ ఇస్మాయిల్ పని నిమిత్తం కోదాడకు వచ్చి తిరిగి ఇంటికి వెళుతుండగా ద్వారకుంట సమీపంలో ఉన్న దర్గా వద్ద నడిగూడెం మండలం రత్నావరం గ్రామానికి.   చెందిన బెల్లంకొండ వినయ్ కోదాడ పట్టణం సాలార్జంగ్ పేటకు చెందిన ఎస్కే మతీన్ లు  బైకును వెంబడించి ఆపి తాము ఆప్కా రి శాఖ పోలీసులమని తనిఖీ చేయాలని బెదిరించారు.  గంజాయి తాగినట్లు బాధితుల అభియోగం మోపారు. అతని నుంచి తొలుతా రూ. 1000, తర్వాత రూ2500ఫోన్ పే చేయించుకున్నారు. అది సరిపోదు అంటూ సిఐ  ఇంకా సీరియస్ గా ఉన్నారని చెప్పి ఫోన్ లాక్కొని అతను ఫోన్లో ఉన్న నెంబర్ల ద్వారా కుటుంబ సభ్యులు ఫోన్ చేసి మీ వాడిని ఇలా గంజాయి నడిపిస్తున్నాడని అనుమానంతో పట్టుకున్నాము అని వెంటనే మీరు 5000 తీసుకొని రావాలని లేకుంటే కేస్ చేస్తామని బెదిరించారు.  వీరి ప్రవర్తన అనుమానం రావడంతో వారు కోదాడ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో  ఫోన్ పే నెంబర్ల ఆధారంగా అనుమానితులను పట్టుకొన్నారు. బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు
చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని రూరల్ ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు.

0Shares

Related posts

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన బీర్ల ఐలయ్యకు శుభాకాంక్షలు

News Telangana

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా రిజిస్టర్ … అంతులేని అవినీతి

News Telangana

కెసిఆర్ ప్ర‌భుత్వంపై ఈసికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు

News Telangana

Leave a Comment