👉పంచాయతీ రాజ్ ఇంజనీర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు…
👉7000 రూపాయలు లంచం తీసుకుంటు పట్టుబడ్డ సీనియర్ అసిస్టెంట్.
👉ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి వివరాలు వెల్లడి.
రాజన్న సిరిసిల్ల జిల్లా /న్యూస్ తెలంగాణ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ రావు 7000/- రూపాయలు లంచం డిమాండ్ చేస్తూ పట్టబడ్డాడు.
ఏసిబి డిఎస్పి వివరాల ప్రకారం
రాజన్న సిరిసిల్ల జిల్లా లింగన్నపేట గ్రామానికి చెందిన వెంకన్న 2021లో స్మశాన వాటిక కాంపౌండ్ వాల్ 438,000/-రూపాయలతో నిర్మించారు. వీటికి సంబంధించిన బిల్ ల కోసం పై అధికారికి పంపించడం కోసం కాంట్రాక్టర్ వెంకన్న దగ్గర 7000/- రూపాయలు డిమాండ్ చేయగా బాధితుడు ఏసిబి అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం రోజు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ రావు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డాడని తెలిపారు. దర్యాప్తు నిమిత్తం ఎసిబి కోర్టు తరలించడమైనది ఏసీబీ డి డీఎస్పీ రమణ మూర్తి వెల్లడించారు