ఎండపల్లి, డిసెంబర్ 09(న్యూస్ తెలంగాణ):
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపుర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ ఇప్పల లక్ష్మి భర్త “ఇప్పల లచ్చయ్య” శుక్రవారం రోజున అనారోగ్యం తో మరణించగా వారి కుమారుడు ఇప్పల మల్లేశం, వారి కుటుంబ సభ్యులను శనివారం రోజున పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలుపడం జరిగింది. ఈ పరామర్శ లో ఎండపల్లి ఫ్యాక్స్ చైర్మన్ గూడ రామ్ రెడ్డి, ఎండపల్లి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సింహాచలం జగన్, కోటిలింగాల ఆలయ కమిటీ చైర్మన్ పదిరె నారాయణరావు, గంగాధరి శేఖర్, పడిదం వెంకటేష్, గాదం భాస్కర్, దుర్గం కృష్ణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.