AP: వరద ప్రభావిత ప్రాంతాల్లో తాను ఎందుకు పర్యటించలేదన్న TDP విమర్శలకు CM జగన్ కౌంటర్ ఇచ్చారు. ‘విపత్తుల సమయంలో నేను పర్యటిస్తే.. అధికార యంత్రాంగం అంతా నా వెనుకే ఉంటుంది. సహాయక చర్యలు లోపిస్తాయి. జరిగే పనిని చెడగొట్టి, ఫొటోలకు పోజులిచ్చి, మీడియాలో కనిపించాలని తాపత్రయపడే CM ఇప్పుడు లేడు. అందుకే నేను రాకుండా కలెక్టర్, అధికారులు, సచివాలయ వ్యవస్థను అప్రమత్తం చేశా’ అని బాపట్ల పర్యటనలో CM వెల్లడించారు.