న్యూ ఢిల్లీ, డిసెంబర్ 15 ( న్యూస్ తెలంగాణ ) :-
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పార్లమెంట్ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కొనసాగుతోంది. పట్టుబడ్డ ఆరుగురు నిందితులను లోతుగా విచారిస్తున్నారు. పార్లమెంట్‌పై దాడికి పాల్ప డ్డ సాగర్‌శర్మ, మనో రంజన్, నీలం, ఆమోల్ షిండే, విక్కీ శర్మ, అతని భార్యను ఇప్ప టికే అదుపు లోకి తీసుకు న్నారు. పోలీసులు అయితే ప్రధాన సూత్రధారి అయిన లలిత్ ఝూ మాత్రం పోలీసుల నుంచి తప్పించుకొని రాజస్థాన్‌లో తలాదా చుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇతని కోసం రాజస్థాన్‌లో తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఈ విషయం తెలుసుకున్న లలిత్ ఝా ఢిల్లీలోని కర్తవ్యపథ్ పోలీ స్‌స్టేషన్‌లో లొంగిపోయారు. వెంటనే ఇతనిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. పార్లమెంట్‌పై దాడి చేసిన తరువాత బస్సులో రాజ స్థాన్లోని నాగౌర్‌కు వెళ్లి ఒక హోటల్లో ఉన్నట్లు తెలి పాడు. అలాగే పార్లమెంట్ బయట జరిగిన తతంగాన్ని మొత్తం వీడియో తీసి కోల్‌కత్తాలోని నీలక్ష్ ఐష్‌కు పంపినట్లు పోలీసులు నిర్థారించారు. నీలాక్ష్ ఐష్ కోల్‌కత్తాలో ఒక స్వచ్ఛంద సంస్థ నడుపు తున్నట్లు తెలుస్తోంది. నీలాక్ష్ను పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందం ఇప్పటికే కోల్కత్తా చేరుకుంది. ఇదిలా ఉంటే పార్లమెంట్ దాడిపై సంచలన విష యాలు వెలుగులోకి వచ్చాయి. పక్కాప్లాన్ ప్రకారమే దాడికి పాల్పడ్డట్లు చెబుతున్నాడు నిందితుడు. వీరి వద్ద నుంచి ప్రధాని మిస్సింగ్ అంటూ ముద్రిం చిన కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీని వెనుక సంఘ విద్రోహ శక్తులు ఉన్నారంటూ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు
previous post
next post