ధర్మారం, డిసెంబర్15 (న్యూస్ తెలంగాణ):
పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలంలోని స్థానిక సాధనజూనియర్ కళాశాలలో డిసెంబర్ – 17 ఆదివారం రోజున మెగా జాబ్ మేళా జరగనుంది. ఈ కార్యక్రమంలో 12 కంపెనీలు పాల్గొననున్నాయి. ఇందులో 2015 – 23 సంవత్సర మధ్య కాలంలో ఉత్తీర్ణులైన ఆసక్తి గల అభ్యర్థులు ఇందులో పాల్గొనవచ్చని కళాశాల ప్రిన్సిపాల్ గాజనవేని కుమార్ తెలిపారు.10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్, ఎంటెక్, పీజీ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ అభ్యర్థులు ఇందుకు అర్హులు అని తెలియజేశారు. ఇందుకు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదని తెలుపుతూ, రిజిస్ట్రేషన్ కోసం “8074442121” గల మొబైల్ నెంబర్ ను సంప్రదించాలని ప్రిన్సిపాల్ కుమార్ కోరారు. ఈ జాబ్ మేళా ఆదివారం ఉదయం 10 గంటల నుండి, సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నట్లు కళాశాల యాజమాన్యం తెలిపారు.