జనగామ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ధి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి
మద్దూరు నవంబర్28(న్యూస్ తెలంగాణ)
ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లా మద్దూరు మండలకేంద్రంలో కొమ్మూరీ ప్రతాప్ రెడ్డి ఇంటింటి ప్రచార నిర్వహించారు. ఈ సంధర్భంగా
కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి మండల ప్రజలు డబ్బు చప్పులు బతుకమ్మ, కళాకారుల నాట్యంతో కోమ్మురి ప్రతాపరెడ్డికి మండల ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.అనంతరం
కొమ్యూరి ప్రతాపరెడ్డి మాట్లాడుతూ… హైదరబాద్ చుట్టు ప్రక్కల అనేక గ్రామాల్లో భూ కబ్జాలకు పాల్పడి జనగామ ప్రాంతంలోని భూములను కబ్జా చేయాలని చూస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఈ ఎన్నికల్లో పరాభవం ఖాయమన్నారు.ఇక్కడి ప్రాంత ప్రజలు నిజాం నైజాం రజాకార్లతో పోరాడిన ఈ ప్రాంత ప్రజలు,అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేశాం… నేను రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మద్దూరు మండలానికి మోడల్ స్కూల్, జూనియర్ కాలేజ్ మంజూరు చేశాను.కేసీఆర్ వచ్చిన తర్వాత మద్దూరుకి రెండు వైన్ షాపులు,దూల్మిట్ట మండలానికి రెండు వైన్ షాపులు తీసుకువచ్చి మండలాల ప్రజలను తాగుబోతులుగా చేసిండని విమర్శించారు.2014తో బిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని మాయమాటలు చెప్పి గద్దేనెక్కి కూర్చుండు తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసిఅర్ దళితున్ని ముఖ్యమంత్రి చేస్తాను అని చెప్పి మోసం చేసిండు అలాగనే దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి ఇస్తాని మోసం చేసిండు,నిరుద్యోగులకు 3వేల నిరుద్యోగ భృతి ఇస్తానని మోసం చేసి కెసిఆర్ తన కుటుంబానికి ఉద్యోగాలు వచ్చాయి. తెలంగాణ ఉద్యమంలో లక్ష రూపాయలు లేని కేసీఆర్ ఇప్పుడు లక్షల కోట్లు దోచుకున్నాడు.కాలేశ్వరం ప్రాజెక్టు ఆరు వేల కోట్ల రూపాయలతో వెచ్చించి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండని విమర్శించారు.తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని మీరంతా ఆదరించి చేతిగుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించండి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి వచ్చిన తర్వాత వందరోజులలో ఆరు గ్యారెంటిలను అమలు చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కొండల్ రెడ్డి,గ్రామ సర్పంచ్ జనార్థన్ రెడ్డి,ఉప సర్పంచ్ హరిఫ్,మాజీ సర్పంచ్ ముక్తార్,మ్యాక మల్లేశం, గ్రామ శాఖ అద్యక్షులు శౌకత్,నాయకులు సీనియర్ నాయకులు రాచకొండ ఉప్పలయ్య,తాజ్ అహ్మద్,బురుగు రాజు,ఫసి,ముంతాజ్,కనక చద్రం,జిల్లా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్,జిల్లా వ్యవసాయ అద్యక్షులు ఈరీ భూమయ్య,మండల అధ్యక్షలు జంగిటి యాదగిరి,మహిళా నాయకురాలు మమత,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.