ఎండపల్లి, డిసెంబర్04 (న్యూస్ తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రజా తీర్పు ను శిరసా వహిస్తున్నామని ధర్మపురి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఆర్ఎస్ గెలుపు కోసం నిరంతరం పని చేసిన ప్రతి కార్యకర్తకు, ప్రేమతో ఓటేసి ఆశీర్వదించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజే శారు. ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా తనకు అవకాశం ఇచ్చిన ప్రజలను మర్చి పోలేనని చెప్పారు.
నియోజకవర్గ అభివృద్ధి విషయంలో తనకు సహకరించిన ప్రజలకు, ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పని చేసిన బీఆర్ఎస్ ప్రజా ప్రతి నిధులు, నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్ లోనూ నియోజకవర్గ ప్రజలతోనే కలిసి ఉంటానని చెప్పారు. ప్రజా సమస్యలు ఎప్పటి కప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు తనవంతు సహకరిస్తానని చెప్పారు. ప్రజలు మార్పు కోరుకున్నారని చెప్పారు. తన స్వప్రయోజనాల కోసం ఏనాడు ఎవరిపైన ఆరోపణలు చేయలేదన్నారు. నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసమే తాను పనిచేశానన్నారు.
previous post