July 27, 2024
News Telangana
Image default
PoliticalTelangana

అమ్మాయి చేతిలో సీనియర్ నేత ఓటమి

జనగామ జిల్లా, డిసెంబర్ 03 ( న్యూస్ తెలంగాణ ) :-
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఊహించని రీతిలో వెలువడుతు న్నాయి. గెలుస్తా రనుకున్న కీలక నేతలు ఓడిపో తుండగా..ఎవరూ ఊహించని అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. పాలకుర్తిలో సైతం ఇలాంటి ఫలితమే వచ్చింది. 30 ఏళ్ల రాజకీయ సుధీర్ఘ అనుభవం ఉన్న నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటమి పాలయ్యారు. పాలకుర్తిలో 26 ఏళ్ల కాంగ్రెస్ అభ్యర్థిని యశస్వీని రెడ్డి చేతిలో ఎర్రబెల్లి ఓటమి చవి చూశారు. దుబ్బాకలో సైతం ఇలాగే షాకింగ్ రిజల్టే వచ్చింది. దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి చేతిలో రఘునందన్ రావు ఓటమి పాలయ్యారు. ఇక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ దిశగా దూసు కుపోతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 61 స్థానాలు దాటి ఘన విజయం దిశగా హస్తం పార్టీ పయణిస్తోంది

0Shares

Related posts

నేడు ఇంద్రవెల్లి లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

News Telangana

నీటి వివాదంపై ఎమ్మెల్సీ కవిత రియాక్షన్

News Telangana

తెలంగాణలో గెలిచిన నూతన MLA ల జాబితా

News Telangana

Leave a Comment