September 8, 2024
News Telangana
Image default
Telangana

న్యూస్ తెలంగాణ దినపత్రిక 2024 క్యాలెండర్ను ఆవిష్కరించిన ఎస్సై శ్రీనివాస్ యాదవ్

  • ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి కోటేష్

సూర్యాపేట జిల్లా బ్యూరో న్యూస్ తెలంగాణ దినపత్రిక చిలుకూరు జనవరి 21:-

ఆనతి కాలంలోనే అందరి మనసులు చూరగొని రాష్ట్రాలలో సమాచారo సేకరిస్తూ నిజాలను నిర్భయంగా వెలికితీస్తూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను అధికారుల ప్రజాప్రతినిధుల ముందు ఉంచి ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్న దినపత్రిక న్యూస్ తెలంగాణ అని చిలుకూరు ఎస్సై శ్రీనివాస్ యాదవ్ అభివర్ణించారు. చిలుకూరు పోలీస్ స్టేషన్లో న్యూస్ తెలంగాణ 2024 సంవత్సరా క్యాలెండర్ ను అయన ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ సమాజంలోని ప్రజా సమస్యలే పరిష్కార మార్గంగా భావిస్తూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడంలో ”న్యూస్ తెలంగాణ”ఎప్పటికప్పుడు కృషి చేస్తుందన్నారు.నిజాలను నిర్భయంగా వెలికి తీసి అధికారుల ముందు ఉంచుతున్న న్యూస్ తెలంగాణ దినపత్రిక యాజమాన్యంకు కృతజ్ఞతలు తెలిపారు.. మునుముందు రాష్ట్రాల్లో మరిన్ని ప్రజా సమస్యల సేకరించి ఆదర్శ పత్రికగా వెలుగొందాలని వారు ఆకాంక్షించారు.ప్రతి ఒక్కరు న్యూస్ తెలంగాణ దినపత్రిక ను ఆదరించి భవిష్యత్తులో మరింత ముందుకు తీసుకు వెళ్ళతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి కోటేసు ఏఎస్ఐ పులి వెంకటేశ్వర్లు మరియు పోలీస్ సిబ్బంది రిపోర్టర్ కాంపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

0Shares

Related posts

ఉదయం 8 గంటలకు కౌంటింగ్ : ఈసీ

News Telangana

కోదాడ లో ఘరానా మోసం… సీఐ, ఎస్ఐ అంటూ టోకరా

News Telangana

మేడిగడ్డ పునరుద్ధరణ మా బాధ్యత కాదు ఎల్‌అండ్‌టీ సంచలన లేఖ

News Telangana

Leave a Comment