September 8, 2024
News Telangana
Image default
National

స్టార్ హీరో దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ❓️

తమిళనాడు ( News Telangana ) :-
ప్రముఖ నటుడు ‘దళపతి’ విజయ్ తమిళనాడులో సొంత రాజకీయ పార్టీ ప్రారంభించే యత్నాల్లో ఉన్నారు.

విజయ్ పార్టీ అధ్యక్షుడుగా ఎన్నికైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ‘ఎన్నికల కమిషన్ వద్ద పార్టీ నమోదు ప్రక్రియలో ఉన్నాం’ అని పార్టీ కీలక సభ్యుడు ఒకరు ఒక ఆంగ్ల వార్తా చానెల్‌తో చెప్పారు.

పార్టీ రిజిస్ట్రేషన్‌కు ముందు జరిగిన సమావేశానికి పార్టీ జనరల్ కౌన్సిల్ సభ్యులు సుమారు 200 మంది హాజరైనట్లు ఆ వర్గాలు తెలిపాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి, కోశాధికారి నియామకాలూ జరిగాయి. పార్టీ కేంద్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ,సిఇసి,ని కూడా ఏర్పాటు చేశారు.

పార్టీ పేరు, రిజిస్ట్రేషన్‌పైన నిర్ణయం తీసుకునేందుకు, ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనేందుకు కూడా విజయ్‌కు కౌన్సిల్ అధికారం ఇచ్చింది. విజయ్ ఎప్పుడు కార్యోన్ముఖుడు అవుతారని ప్రశ్నించగా, ‘ఆయన త మిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి వస్తారు’ అని ఒక ప్రతినిధి సమాధానం ఇచ్చారు.

పార్టీకి ఏ పేరు పెడతారన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ‘తమిళనాడు సంప్రదాయం దృ ష్టా పేరులో తప్పని సరిగా కళగం ఉంటుంది’ అని ఆయన తెలిపారు.

తమిళ సినీ రంగంల తదుపరి రజినీకాంత్‌గా భావిస్తున్న విజయ్ 68 చిత్రాలలో నటించారు. ఆయన ఒక దశాబ్దంగా రాజకీయ ఆకాంక్షలతో ముందుకు సాగుతున్నారు. కాగా, ఒక ఆంగ్ల వార్తా సంస్థ సమాచారం ప్రకారం, విజయ్ పార్టీకి ‘తమిళగ మున్నేట్ర కళగం’ అని పేరు పెట్టే అవకాశం ఉంటుందని విజయ్ సన్నిహితులు తెలిపారు…

0Shares

Related posts

నేటి నుంచి ఐదురోజుల పాటు ఆకాశంలో అద్భుతం

News Telangana

కాంగ్రెస్ పేరుతో నకిలీ వెబ్ సైట్ ద్వారా క్రౌడ్ ఫండింగ్

News Telangana

పార్లమెంట్ లో 141 మంది ఎంపీల సస్పెన్షన్.. దేశవ్యాప్తంగా ధర్నాకు విపక్షాలు ప్లాన్..?

News Telangana

Leave a Comment