June 20, 2024
News Telangana
Image default
National

ఛ‌త్తీస్ గ‌డ్‌లో మావోయిస్టుల దాడి.. ఎస్ఐ మృతి

సుక్మా , డిసెంబర్ 17 ( న్యూస్ తెలంగాణ ) :-
చ‌త్తీస్‌గ‌డ్‌లో మావోయిస్టులు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై ఆదివారం ఉదయం దాడికి పాల్ప‌డ్డారు. ఈ దాడిలో ఎస్ఐ సుధాక‌ర్‌ రెడ్డి అక్క‌డిక్క‌డే మృతి చెందాడు. ఆదివారం ఉదయం సుక్మా జిల్లాలోని బెద్రెలోవారాంతపు అంగడి లో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై మావోయిస్టులు దాడిచేశారు. ఎస్‌ఐ సుధాకర్‌ రెడ్డి అక్కడికక్కడే చనిపోగా కానిస్టేబుల్‌ రాము తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఉదయం ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంద‌ని, సుక్మా జిల్లా పోలీసులు సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా తెలిపారు. గాయపడిన రాముకు జవాన్లు ప్రాథమిక చికిత్స అందించారని అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం హెలికాప్టర్‌లో బెద్రెలోని ఆస్ప‌త్రికి తరలించామన్నారు

0Shares

Related posts

మనిషిని పోలిన ముఖంతో ఓ వింత మేకపిల్ల

News Telangana

అర్టికల్ 370పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు..

News Telangana

విస్తరిస్తున్న జే ఎన్.1 సబ్ వేరియంట్ వైరస్.

News Telangana

Leave a Comment