September 8, 2024
News Telangana
Image default
PoliticalTelangana

ఆదర్శ ఉపాధ్యాయులు

ఖమ్మం జిల్లా ( న్యూస్ తెలంగాణ ) :-
మహిళా సాధికారతకు ఖమ్మం జిల్లాలోని కొందరు ఆదర్శ మహిళా ఉపాధ్యాయులు సరైన నిర్వచనం పలికారు. ఫ్రీ గా దొరికితే చాలు ఏదైనా సరే వాడేద్దాం అనే చోటనే స్వచ్ఛందంగా ఫ్రీ బస్సు టికెట్ సర్వీసును వాడుకోకుండా, ఈ అవకాశాన్ని పేదలకే వదిలేసి తాము టికెట్ తీసుకుని ప్రయాణించాలని నిర్ణయించారు ఈ ఆదర్శ ఉపాధ్యాయులు. ఖమ్మం రూరల్ మండలం ఎం.వెంకటాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులు శనివారం సాయంత్రం కాంప్లెక్స్ మీటింగ్ లో ఉపాధ్యాయులందరూ, కలిసి ఫ్రీ బస్సు, ఫ్రీ టికెట్ మనం వాడొకోవద్దని డిసైడ్ అయ్యారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సౌకర్యాన్ని వృద్ధులకు, కాలేజీ పిల్లలకు ఒదిలేద్దామని నిర్ణయించారు. తద్వారా టీ ఎస్ ఆర్టీసీ భవిష్యత్తు కోసం ఇంకా పలువురు ఆటో కార్మికులకు ఉపాధినిస్తూ వారి కుటుంబాలకు సాయంగా ఉందామని, ప్రతిజ్ఞ చేశారు. మహిళా ఉపాధ్యాయుల నిర్ణయం ప్రశంసనీయమని పలువురు కొనియాడారు

0Shares

Related posts

రాహుల్ గాంధీ కారుపై దుండగుల దాడి

News Telangana

సిరిసిల్ల జిల్లాలో తమ్ముడిని నరికి చంపిన అన్న

News Telangana

రేషన్ షాపులను తనిఖీ చేసిన జిల్లా పౌర సరఫరాల అధికారి

News Telangana

Leave a Comment