- యూత్ కాంగ్రెస్ మండల అద్యక్షులు కమలాకర్ యాదవ్
మద్దూరు నవంబర్9(న్యూస్ తెలంగాణ)
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.దూల్మిట్ట మండలం జాలపల్లి గ్రామంలో యూత్ కాంగ్రెస్ మండల అద్యక్షులు కమలాకర్ యాదవ్ ఆధ్వర్యంలో, శ్రీమతి సోనియాగాంధీ జన్మదిన్నాన్ని పురస్కరించుకొని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల హామీలో ఒకటైన మహిళలందరికీ ఆర్టిసి బస్సులలో ఉచిత ప్రయాణం శనివారం మధ్యాహ్నం నుండి రేవంత్ ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది,ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జాలపల్లి గ్రామంలో ఆర్టీసీ బస్సును పూలదండలు, తోరణాలతో అలంకరించి మహిళలకు స్వీట్లు పండ్లు పంపిణీ చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు బూర గంగాధర్, రామ్ రెడ్డి, నాయకులు వెంకటేశ్వర్లు, నారిత, రామకృష్ణారెడ్డి, సాగర్, రాములు సార్, ఆంజనేయులు, కనకాంబరం, బాలయ్య, నీల యాదగిరి, సంపతి, భాను, అశోక్, సీనియర్ నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు.