హైదరాబాద్ , డిసెంబర్ 09 ( News Telangana ) :-
మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం, సన్నిహితులు, ఆయనతో క్లోజ్‌గా పని చేసిన అధికారులు ఎవరు కూడా భారత్ విడిచిపెట్టి వెళ్లకుండా చూడాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. వెంటనే వారి పాస్ పోర్టు లను సీజ్ చేసి ఆర్డర్స్ పాస్ చేయాలని సీఎంను డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ ఆయన ఒక వీడియో ప్రకటనలో మాట్లాడారు. తెలంగాణ లక్షల కోట్లు అప్పులపాలు అయ్యిందని, తెలంగాణని నడపాలంటే సత్యం బయటకు రావాలని అన్నారు.వెంటనే అప్పులపై ఇన్వెస్టిగేషన్ జరిపిం చాలని, అంత వరకు ఎవరిని కూడా దేశం విడిచి బయటకువెల్లని వ్వద్దన్నారు. రిటైర్డ్, ప్రస్తుత ఐఏఎస్, ఐపీఎస్‌లు రేవంత్ రెడ్డికి సీఐడీకి కోపరేట్ చేయాలని ఆయన కోరారు.ఎందుకంటే ప్రజలకు న్యాయం జరగాలని,రాష్ట్రాన్ని కాపాడు కోవాలని కేఏ పాల్ అన్నారు.
next post