September 8, 2024
News Telangana
Image default
Telangana

మంత్రులకు గజమాలతో ఘనంగా స్వాగతం

News Telangana :- ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా
ఖమ్మం జిల్లాకు చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఖమ్మం జిల్లా సరిహద్దు నాయకన్ గూడెం సమీపంలోని టోల్గేట్ వద్ద మంత్రులకు భారీ గజమాలతో ఘనంగా స్వాగతం పలికిన జిల్లా కాంగ్రెస్ శ్రేణులు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముగ్గురు కీలక నేతలు మంత్రుల హోదాలో తొలిసారి ఖమ్మం జిల్లాకు వచ్చి కూసుమంచి మండల కేంద్రంలోని పి హెచ్ సి ఆసుపత్రిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని పది లక్షలకు పెంచుతూ విడుదల చేసిన పోస్టర్లను ఆవిష్కరించారు. నాయకన్ గూడెం బస్టాండ్ సెంటర్లోని జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు‌. ప్రచార రథంపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ రోడ్డు మార్గం ద్వారా మంత్రులు ముందుకు సాగారు. ఖమ్మం, వరంగల్ క్రాస్ రోడ్ వద్ద పెద్ద ఎత్తున ఘనంగా స్వాగతం పలికిన సిపిఐ తెలుగుదేశం పార్టీ శ్రేణులు. నాయకన్ గూడెం నుంచి ఖమ్మం వరకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు

0Shares

Related posts

పోలీస్ అధికారి పోలీస్ వాహనంలో ముందు సీట్లోనే కూర్చోవాలి

News Telangana

రాష్ట్ర మంత్రిగా ఉన్న ఇతర బాధ్యతలు ఉన్న ములుగు నుంచే పాలన కొనసాగిస్తా

News Telangana

వేములవాడలో అది శ్రీనివాస్ ఘనవిజయం

News Telangana

Leave a Comment