December 3, 2024
News Telangana
Image default
Telangana

Breaking news : తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం


న్యూస్ తెలంగాణ ఫిబ్రవరి 25/తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా సీనియర్ జర్నలిస్ట్ కె.శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ నియామకంపై ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎమ్.హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. కేబినెట్ హోదా కలిగిన ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు. ఇప్పటివరకు అల్లం నారాయణ తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా ఉన్నారు. ఆయన స్థానంలో కె.శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు చేపడతారు. శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం ప్రజాపక్షం పత్రిక సంపాదకుడిగా ఉన్నారు. ఆయన గతంలో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) సెక్రటరీ జనరల్ గానూ, విశాలాంధ్ర దినపత్రిక ఎడిటర్ గానూ వ్యవహరించారు. మీడియా అకాడమీ చైర్మన్ గా కె.శ్రీనివాస్ రెడ్డిని నియమించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి జర్నలిస్టులంతా కృతజ్ఞతలు తెలిపారు.

0Shares

Related posts

ఏజెంట్ల చేతిలో సంగారెడ్డి పటాన్ చెరువు రవాణా శాఖ

News Telangana

హీరో వెంకటేష్ సోదరుడు సురేష్ లపై కేసు నమోదు చేయండి: నాంపల్లి కోర్టు

News Telangana

తెలంగాణ ప్రభుత్వానికి మావోయిస్ట్ నేత జగన్ పేరిట లేఖ విడుదల

News Telangana

Leave a Comment