September 15, 2024
News Telangana
Image default
Crime NewsPoliticalTelangana

చింతపల్లి సబ్ఇన్స్పెక్టర్ సతీష్ రెడ్డి సస్పెండ్

నల్లగొండ జిల్లా , డిసెంబర్ 11 ( News Telangana ) :-
ఓ భూవివాదంలో తల దూర్చి అత్యుత్సాహం చూపించిన చింతపల్లి ఎస్ఐ సతీష్ రెడ్డి ని సోమవారం ఐ.జి.పి ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ అపూర్వరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూ వివా దాలు, సివిల్ విషయాలలో జోక్యం చేసుకోవద్దని ఎవరైనా ఈలాంటి కార్య కలాపాలకు పాల్పడితే సహించేది లేదని అన్నారు. కాగా, నల్లగొండ జిల్లా చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఆదివారం లాకప్‌డెత్‌ జరిగింది. చింతపల్లి మండలం పాలెంతండాకు చెందిన సూర్యా నాయక్‌ (50)కు ఆయన సోదరుడికి మధ్య కొంత కాలంగా భూ వివాదం కొనసాగుతున్నది. ఇందులో అన్నదమ్ములు ఒకరిపై ఒకరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసు కున్నారు. ఎస్‌ఐ సతీశ్‌రెడ్డి ఆదివారం సాయంత్రం సూర్య నాయక్‌తోపాటు అతని సోదరుడిని పోలీస్‌ స్టేషన్‌కు పిలిచి విచారణ జరిపారు. ఈ క్రమంలో సూర్యనాయక్‌ హైబీపీతో స్టేషన్‌లోనే కిందపడి పోయాడు. వెంటనే అతడిని బంధువులు, పోలీసులు దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు

0Shares

Related posts

‘రైతు బంధు’ అమలుపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

News Telangana

పెద్దపల్లి డస్ట్ రవాణాపై న్యూస్ తెలంగాణ కథనాలకు భారీ స్పందన…!

News Telangana

తెలంగాణలో గెలిచిన నూతన MLA ల జాబితా

News Telangana

Leave a Comment